కల్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

0

How To Apply for Kalyana Lakshmi and Shaadi Mubarak Scheme Online: కళ్యాణలక్ష్మీ/షాదీ ముబారక్ పథకం కింద తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

( ఇది కూడా చదవండి: PM Kisan Maandhan Yojana Scheme: రైతులకు నెల నెల రూ 3వేల పింఛన్‌.. కావాల్సిన అర్హతలు? ఎంత చెల్లించాలి?)

2017, మార్చి 13న ప్రవేశపెట్టిన 2017-18 తెలంగాణ బడ్జెట్ లో ఈ పథక ఆర్థిక సాయాన్ని రూ.51వేల నుండి రూ.75,116 లకు పెంచారు. 2018, మార్చి 19న రూ.1,00,116 కు పెంచారు.                                                    

కళ్యాణలక్ష్మీ / షాదీ ముబారక్ పథకానికి కావాల్సిన అర్హతలు:

 • అర్హులైన యువతులు తమ వివాహానికి నెల రోజుల ముందు మీ-సేవ కేంద్రాల మరియు మీసేవ ఆన్లైన్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి
 • దళిత, గిరిజన, బీసీ, ఈబీసీ కులాలకు చెందిన యువతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు
 • ధరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. వారి కుటుంబ సభ్యుల ఆదాయం రూ. 2 లక్షలక(బీసీ, ఈబీసీ కులాలు వారు అర్బన్ లో – 2,00,000, గ్రామాలలో – 1,50,000) మించకూడదు
 • వివాహ సమయానికి అమ్మాయి వయసు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి
 • బ్యాంకు ఖాతా పుస్తకం (వధువు పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న బ్యాంకు ఖాతా పుస్తకంపై వధువు ఫొటో ఉండాలి)

కళ్యాణలక్ష్మీ / షాదీ ముబారక్ లబ్ధిదారులు:

వివాహ సమయానికి అమ్మాయి వయసు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి,వారి కుటుంబ సభ్యుల ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదు.

కళ్యాణలక్ష్మీ / షాదీ ముబారక్ ప్రయోజనాలు:

పేద ప్రజల అమ్మాయిల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.

మ్యారేజ్ సర్టిఫికేట్ కి కావాల్సిన పత్రాలు

 • పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఆధార్ కార్డ్స్  
 • ఎస్ ఎస్ ఎస్(SSC) లేదా పుట్టిన తేదీ(DOB) సర్టిఫికేట్   
 • కుల దృవీకరణ పత్రాలు ఇద్దరివి
 • పెళ్లి ఫోటో, పెళ్లి పత్రిక
 • ముగ్గురు సాక్షుల వాగ్మూలం

పైన తెలిపిన పత్రాలు మీ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో అప్లై చేసుకోవాలి.  

కళ్యాణలక్ష్మీ/షాదీ ముబారక్ దరకాస్తు విదానం:

మనం పైన తెలిపిన విదంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ను పొందిన తర్వాత కళ్యాణలక్ష్మీ/షాదీ ముబారక్ పథకానికి ధరఖాస్తూ మీసేవ లేదా ఆన్లైన్ లో చేసుకోవాలి.  

 • మ్యారేజ్ సర్టిఫికేట్
 • ఆధార్ కార్డ్స్ ఇద్దరివి
 • కుల, ఆదాయం మరియు నివాస దృవీకరణ పత్రం
 • రేషన్ కార్డ్స్
 • పెళ్లి కూతురు తల్లి/సంరక్షకుడి ఆధార్ కార్డ్
 • పెళ్లి కూతురు తల్లి/సంరక్షకుడి బ్యాంక్ పాస్ బుక్
 • అనాధ అయితే పెళ్లి కుతూరి పాస్ బుక్
 • పెళ్లి ఫోటో లు
 • పెళ్లి కూతురి పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
 • పెళ్లి పత్రిక
 • కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్ ఫామ్
 • మ్యారేజ్ సర్టిఫికేట్
 • వివాహ వాగ్మూలం(అమ్మాయి తల్లి తండ్రులు, ముగ్గురు సాక్షుల సంతకాలు) 
 • వివాహ దృవీకరణ పత్రం మీద వీఆర్వో సంతకం చేయాలి
 • ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగి సూరిటీ సంతకం చేసి ఆ ఫార్మ్స్ కి ఇద్దరు ఆధార్ కార్డ్స్, ఐడి కార్డ్స్ జత చేయాలి  

పైన తెలిపిన వాటిని 2 లేదా మూడు సెట్స్ జిరాక్స్ తీసుకొని మీ సేవలో లేదా ఆన్లైన్ లో ధరఖాస్తు చేసుకోవచ్చు. ధరఖాస్తు చేసుకున్నాక అన్నీ పత్రాలను జత చేసి మీ మండల కార్యాలయంలో ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మండల రెవెన్యూ ఆఫీసర్ సంతకం చేసి ఎంఎల్ఏ కు పంపుతారు.

ఎంఎల్ఏ సంతకం చేసిన తర్వాత ఆర్డీవో కార్యాలయానికి పంపుతారు. అక్కడ ఆర్డీవో సంతకం చేసన తర్వాత నగదు ఉంటే మీకు చెక్ అనేది ఇస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here