హాయ్ ఫ్రెండ్స్, మనం కాలేజీ ఫీజ్ రీఎంబెర్స్ మెంట్ కి ధరఖాస్తు చేసుకోవాలన్న, ఏదైనా పథకానికి ధరఖాస్తు చేసుకోవాలన్న లేదా ఏదైనా కుల దృవీకరణ పత్రం కోసం ధరఖాస్తు చేసుకోవాలన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలకు సంబంధిచిన ప్రతి ఒక్క విషయానికి మనకు తప్పని సరిగా కావలసింది ఆదాయ దృవీకరణ పత్రం. ఇలాంటి ఆధాయ దృవీకరణ పత్రాన్ని మనం ఇప్పటి వరకు మన మండలంలోని మీ సేవకి వెళ్ళి అక్కడ దానికి సంబందించిన పత్రాలు సమర్పించి ధరఖాస్తు చేసుకునే వాళ్ళం తర్వాత తహశీల్దార్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ అధికారులను సంప్రదించి పత్రాన్ని పొందే వాళ్ళం.
ఇప్పుడు మనం అలా మీ సేవకి వెళ్ళి ధరఖాస్తు చేసుకోకుండా ఇంట్లో నుండే ధరఖాస్తు చేసుకోవచ్చు అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. మనం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధిచిన మీ సేవ సైట్(https://ts.meeseva.telangana.gov.in/meeseva/home.htm) లోకి వెళ్ళి అప్లికేషన్ ట్యాబ్ ఓపెన్ చేశాక అందులో రెవెన్యూ(Revenue) దాంట్లో ఆధాయ దృవీకరణ పత్రాన్ని (Income General Application Form) డౌన్లోడ్ చేసుకోండి. పత్రాన్ని డౌన్లోడ్ చేసుకున్నాక ఆ పత్రంలో పూర్తి నింపండి, దాన్ని నింపాక స్కాన్ చేసి పిడిఎఫ్(pdf) ఫార్మాట్ లోకి 3mb లోపు సేవ్ చేసుకోండి.
మీ సేవ సైట్ లో లాగిన్ అయ్యాక రెవెన్యూ సేవను ఎంచుకోండి అందులో Income Certificateను ఓపెన్ చేశాక అందులో ప్రతి దానికి సంబంధించిన పేరు, తండ్రి పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, పుట్టిన తేదీని, చిరునామా వివరాలను పూర్తి చేయండి. దీని తర్వాత మీ సంవత్సరానికి సంబంధించిన ఆదాయాన్ని ఎంటర్ చేయండి.
ఇప్పుడు మనం తప్పని సరిగా అప్లోడు చేయవలసిన పత్రాలు
- ధరఖాస్తు పత్రం(Application Form)
- రేషన్ కార్డ్ / ఆధార్ కార్డ్/ ఓటర్ ఐడి కార్డ్ (ఏదైనా ఒకటి)
- పే స్లీప్ / ఐటి రిటర్న్స్ నఖలు / Proof of Income
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో (jpg/jpeg 3 kb – 20 kb లోపు)
ఇప్పుడు అన్నీ అప్లోడు చేశాక ఒకటి మాత్రం మరిచిపోవద్దు మీరు మీ సేవ కి వెళ్ళి తీసుకుంటారా లేక పోస్టల్ లో పంపించాల అనేది ఉంటుంది. అది మీ అవసరం మీద అదరపడి ఉంటుంది. మీ సేవకి అయితే 40 రూపాయలు, పోస్టల్ సేవకి అయితే 110 రూపాయలు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అన్నీ పూర్తి చేశాక మీ అప్లికేషన్ కి సంబందించిన నెంబర్ ని సేవ్ చేసుకోవడం మరిచిపోవద్దు.
తాజా టెక్నాలజీ మరియు ప్రభుత్వ సేవల వార్తల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్(Instagram) మరియు యూట్యూబ్(YouTube) ఛానెల్, షేర్ చాట్(Share Chat) వంటి సామాజిక మాద్యమలను అనుసరించండి.