Change Photo in Aadhaar Card: ఆధార్ కార్డులో ఫోటో మార్పు కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

0
Aadhaar-Photo-Change

How To Change a Photo on the Aadhaar Card in Telugu: మన దేశంలోని ప్రతి పౌరుడు తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన పత్రాలలో ఆధార్‌ కార్డు చాలా ముఖ్యమైనది. దేశంలో ప్రభుత్వానికి సంబంధించి ఏ సేవలు పొందాలన్నా, విద్యాలయాల్లో అడ్మిషన్లు, సిమ్‌ కార్డులు, బ్యాంకుల్లో ఖాతా తెరవడం, పింఛను వంటి ప్రతిదాని కోసం ఆధార్‌ కార్డు అనేది చాలా ముఖ్యం.

ఈ ఆధార్ కార్డులో వ్యక్తిగత వివరాలతో పాటు బయోమెట్రిక్‌ సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. అయితే, చాలా మంది ఆధార్‌ కార్డులోని తమ వివరాలను సరిచేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వాటిలో ఆధార్‌ కార్డుపై ఉన్న ఫొటో ఒకటి. వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతి ఒక్కరి ముఖంలో మార్పులు అనేవి వస్తుంటాయి.

(ఇది కూడా చదవండి: Aadhar Card Download: ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేయడం ఎలా?)

మరి చాలా ఏళ్ల క్రితం తీసిన ఆధార్‌పై ఫొటోకు ఇప్పటి మన ముఖానికి అసలు పోలికలే ఉండవు. అందుకే, చాలా మంది ఆధార్‌ కార్డు ఉన్నది మీరేనా అని అడుగుతుంటారు. అయితే, గుర్తింపు తప్పనిసరైన చోట ఏదైనా ఇబ్బందులు ఎదురుకావొచ్చు. మరి ఆధార్‌ కార్డుపై ఉన్న ఫొటోను ఎలా మార్చుకోవలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆధార్ కార్డులో ఫోటో మార్పు కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

మొదట UIDAI అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి.
ఆపై కరెక్షన్/అప్‌డేట్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని మీ వివరాలను నింపండి.
ఆ ఫారమ్‌ను మీ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి తీసుకెళ్లండి.
మీ ఫారమ్‌లో నింపిన వివరాలను బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా సెంటర్ ఎగ్జిక్యూటివ్ ధృవీకరిస్తారు.
ఆ తర్వాత మీరు రూ.100 + జీఎస్టీ చెల్లించాలి.
అప్పుడు అతను మీ కొత్త ఫోటో తీసిన తర్వాత మీకు URN స్లిప్ అందిస్తారు.
URN ద్వారా మీ ఫోటో అప్‌డేట్ స్టేటస్ తనిఖీ చేసుకోవచ్చు.
కొత్త ఫోటో గల ఆధార్ కార్డ్ అప్‌డేట్ కావడానికి గరిష్టంగా 90 రోజుల వరకు సమయం పట్టవచ్చు.

(చదవండి: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త..!)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here