Cibil Score: వాట్సప్‌లో సిబిల్ స్కోర్ ఉచితంగా చెక్ చేసుకోవడం ఎలా..?

0
Cibil Score on Whatsapp
Cibil Score on Whatsapp

Check Free Cibil Score on WhatsApp: ప్రస్తుతం సీబిల్ స్కోర్ ఉన్న ప్రాముఖ్యత గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్ ఇలా ఒకటి ఏమిటి ఏ రకమైన లోన్ అయినా తీసుకోవాలి అనుకున్న మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండటం చాలా అవసరం. చివరికి మీరు క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా.. బ్యాంకులు మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేస్తాయి.

సిబిల్‌ స్కోర్‌/ క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి?

సిబిల్‌ స్కోర్‌/ క్రెడిట్ స్కోర్ అంటే వినియోగదారులు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి పొందిన ఏదైనా రుణాలు, తిరిగి చెల్లించిన వివరాలను తెలియజేయడానికి సూచించే ఒక కొలమానం. రుణ గ్రహితల మొత్తం చరిత్రను క్రెడిట్‌ స్కోర్‌ తెలియజేస్తుంది. వారు గతంలో తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించారా? లేదా అనేది ప్రతి విషయం ఇందులో తెలుస్తుంది.

(ఇది కూడా చదవండి: Credit Score: పేటీఎంలో ఉచితంగా మీ క్రెడిట్‌ స్కోర్‌ను ఇలా తెలుసుకోండి..)

రుణాలు తిరిగి చెల్లించడంలో ఏవైనా సమస్యలు ఉన్నా, గడువును మించి చెల్లించినా వాటి ప్రభావం సిబిల్‌ స్కోర్‌పై తప్పకుండా కనిపిస్తుంది. సిబిల్‌ స్కోర్‌ 300 నుంచి 900 వరకు ఉంటుంది. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి ఆర్థిక వ్యవహారాలు అంత చక్కగా ఉన్నాయని భావిస్తారు. 2000 సంవత్సరంలో ఏర్పాటైన సీబిల్‌ను అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దీనిని ప్రామాణికంగా తీసుకొంటున్నాయి.

క్రెడిట్ స్కోర్ వల్ల రుణ గ్రహీత ఆర్థిక పరిస్థితుల గురించి బ్యాంకులు ఒక అంచనాకు వస్తాయి. క్రెడిట్ స్కోర్ ద్వారా రుణ గ్రహీత బ్యాంకులు లోన్ డిఫాల్ట్‌లు ఏమైనా ఉన్నాయా..? ఇలా చాలా అంశాలను పరిగణలోకి తీసుకుని.. ఆ తర్వాతే మీకు రుణాలను మంజూరు చేస్తాయి. గతంలో ఈ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవాలంటే ఖరీదుతో కూడకున్న పని. అయితే, ప్రస్తుతం చాలా కంపెనీలు మార్కెట్లో క్రెడిట్ స్కోర్ ఫ్రీగా అందిస్తున్నాయి.

అయితే తాజాగా ఎక్స్‌పీరియన్ ఇండియా వాట్సాప్లో క్రెడిట్ స్కోర్ సేవలను ఉచితంగా అందించడం ప్రారంభించింది. వాట్సాప్‌లో ఉచితంగా క్రెడిట్ స్కోర్’ను ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వాట్సాప్‌లో ఫ్రీగా క్రెడిట్ స్కోర్‌ను ఎలా చెక్ చేసుకోవాలి?

  • ముందుగా మీరు ఎక్స్‌పీరియన్ ఇండియాకు చెందిన +91-9920035444 వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేసుకోండి.
  • ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఆ ఫోన్‌కి ‘హాయ్’ అనే సందేశం పంపాలి.
  • దీని తర్వాత మీరు మీ పేరు, ఇ-మెయిల్ ఐడి, ఫోన్ నంబర్ వంటి మీ ప్రాథమిక వివరాలను నమోదు చేయండి.
  • ఆ తర్వాత మీరు వాట్సప్లో తక్షణమే మీ ఎక్స్‌పీరియన్ క్రెడిట్ స్కోర్‌ను చూడవచ్చు
  • మీరు ఎక్స్‌పీరియన్ క్రెడిట్ రిపోర్ట్ పాస్‌వర్డ్ రక్షిత కాపీని అభ్యర్థించవచ్చు. అది మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ IDకి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here