Check Pattadar Passbook Number in Dharani Portal: రైతులకు రిజిస్ట్రేషన్, భూ లావాదేవీల సమయంలో ఎదురయ్యే సమస్యలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం 2020లో ధరణి పోర్టల్ లాంచ్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.
(ఇది కూడా చదవండి: ధరణిలో అప్లై చేసిన అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా?)
తెలంగాణ కొత్తగా తీసుకొచ్చిన ఈ పోర్టల్’లో సమస్యల పరిష్కారం కోసం అనేక మాడ్యూల్స్ ఉన్నాయి. అయితే, ఇప్పుడు మనం ధరణిలో పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ ఎలా తెలుసుకోవాలో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం..
ధరణిలో పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?
- పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ తెలుసుకోవడం 2 మార్గాలు ఉన్నాయి
- ఆధార్ నంబర్ సహాయంతో
- ఈసీ సహాయంతో
ఆధార్ నంబర్ సహాయంతో పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?
- మొదట మనం సిటిజన్ డ్యాష్ బోర్డులోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.



ఆ తర్వాత (TM32) Application for Khata Merging అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి
ఇప్పుడు మీ జిల్లా, మండలం, గ్రామం, ఆధార్ నెంబర్ వివరాలను నమోదు చేయల్సి ఉంటుంది.
ఇప్పుడు మీకు మీరు సర్చ్ చేసిన పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ కనిపిస్తుంది.
ఈసీ సహాయంతో పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?
- మొదట మనం సిటిజన్ డ్యాష్ బోర్డులోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.



ఆ తర్వాత (IM4) Search EC Details అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి
ఇప్పుడు మీ జిల్లా, మండలం, గ్రామం, సర్వే నెంబర్ వివరాలను నమోదు చేయల్సి ఉంటుంది.
ఇప్పుడు మీకు మీరు సర్చ్ చేసిన పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ కనిపిస్తుంది.