గూగుల్ లో నకిలీ ఫోటోలను గుర్తించడం ఎలా?

0

మన దేశంలో ప్రతి ఒక్కరూ రోజుకి 5 గంటలు మొబైల్ వినియోగిస్తున్నట్లు ఇటీవల ఒక నివేదిక పేర్కొన్న సంగతి తెలిసిందే. మనం ఇంటర్నెట్లో కొన్ని రకాల ఫోటోల కోసం వెతుకుతుంటాం. ఇలా వెతికనప్పుడు అనేక రకాల ఫోటోలు కనిపిస్తాయి. అయితే వాటిలో ఏది నిజమో అనేది ఎలా తెలుసుకోవాలో చాలా మందికి తెలియదు. ఎందుకంటే అచ్చం అలాంటి ఫోటోలని గ్రాఫిక్స్ సాయంతో ఎడిటింగ్ చేసి చూపిస్తారు. ఫేక్ ఫోటోల వల్ల చాలా మంది సమస్యలు ఎదుర్కొంటారు. ఎక్కువగా శాతం రాజకీయ నాయకులు, సెలిబ్రిటీల విషయంలో ఇలా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా చూసిన ఫోటో నిజమైనది కదా అనేది తెలుసుకోవాలంటే ఒక చిన్న ట్రిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు.(ఇది కూడా చదవండి: వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్‌ చేసేటప్పుడు ఇవి చేయకండి!)

గూగుల్ ఇమేజెస్

ఆన్ లైన్ లో ఎక్కువగా ఫోటోలను సెర్చ్ చేయడానికి మనం ఎక్కువగా ఉపయోగించేది గూగుల్. గూగుల్ లో మనకు కనిపించే ఫోటోలు నిజమా? కదా అనేది తెలుసుకోవడానికి గూగుల్ ఇమేజెస్ మనకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఆప్షన్ ను అందిస్తుంది. మనం ఏదైనా ఇమేజ్ వెతికినప్పుడు ఆ ఇమేజ్ విషయంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే? గూగుల్ ఇమేజెస్ కి వెళ్లి కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేసి ఫొటో యూఆర్ఎల్ లేదా ఆ ఫొటోను నేరుగా అప్లోడ్ చేయాలి. అప్పుడు వెంటనే గూగుల్ ఆ ఫొటో ఎక్కడి నుంచి వచ్చిందో మూలం ఎక్కడిదో మనకు తెలియజేస్తుంది.

గూగుల్ సెర్చ్

నకిలీ ఫోటోను గుర్తించడానికి మీరు ఎంచుకున్న ఫోటో మీద ఒకసారి రైట్ క్లిక్, మొబైల్ లో అయితే లాంగ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీకు సెర్చ్ గూగుల్ ఫర్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూపిస్తుంది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here