Track Voter ID Card Application Status: ఆధార్ కార్డు, రేషన్ కార్డు వీటి ప్రాముఖ్యత గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఈ కార్డులు కలిగి ఉండాల్సిందే. ఇవేకాకుండా మరో ముఖ్యమైన డాక్యుమెంట్ మన దేశంలో చాలా ముఖ్యమైనది అదే ఓటర్ ఐడీ కార్డు.
ఒక ప్రజాస్వామ్య దేశంలో మీకు నచ్చిన నాయకుడికి ఓటు వేయాలంటే ఓటర్ కార్డు అనేది తప్పనిసరి. 18 ఏళ్లు వయసు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, చాలా మంది ఓటరు కార్డు కోసం ధరఖాస్తు చేసుకున్నాక.. తమ కార్డు Approve అయ్యిందో లేదో తెలుసుకోవడానికి చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. మనం ఈ కథనంలో మీ ఓటర్ కార్డు అప్లికేషన్ స్టేటస్‌ను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం..
కొత్త ఓటర్ కార్డు అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?
- మొదట ఎన్నికల సంఘం https://voters.eci.gov.in/ పోర్టల్ ఓపెన్ చేయండి.
- ఇప్పుడు ఈ పోర్టల్లో మీ పేరు, మొబైల్ నెంబర్ వంటి ఇతర వివరాలు నమోదు చేసి రిజిస్టర్ అవ్వండి.
- మీరు ఈ పోర్టల్లో లాగిన్ అయ్యాక Track Application Status మీద క్లిక్ చేయండి.

- ఆ తర్వాత Reference Number, State వివరాలు నమోదు చేసి Submit మీద క్లిక్ చేయండి.

- ఇప్పుడు మీరు ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఏ దశలో ఉందో మీకు కనిపిస్తుంది.
- ఇలా మీ ఓటర్ కార్డు అప్లికేషన్ స్టేటస్ ఇంట్లో నుంచే తెలుసుకోవచ్చు.