5 నిమిషాల్లో ఆన్లైన్ లో పాన్-ఆధార్ లింక్ చేయండిలా?

0

ఆదాయపు పన్ను రిటర్నులను(ఐటిఆర్) దాఖలు చేయడానికి భారత ప్రభుత్వం పాన్(శాశ్వత ఖాతా సంఖ్య)ను ఆధార్‌తో లింకు చేయడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ లింక్ చేయకపోతే పదివేల రూపాయల జరిమానాను విధించనున్నట్లు తెలిపింది. పాన్-ఆధార్ లింకు చేయకపోతే ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 139ఏ(2)ప్రకారం పాన్ కార్డును రద్దు చేస్తామని కేంద్రంతో పాటు సీబీడీటీ అధికారులు పేర్కొన్నారు.

పాన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ 2021 మార్చి 31లోపు లింక్ చేయాలని కేంద్రం పేర్కొంది. పాన్-ఆధార్‌ లింకు చేయడంలో విఫలమైతే మీరు బ్యాంక్ ఖాతా తెరవడం లేదా పెన్షన్, స్కాలర్‌షిప్, ఎల్‌పీజీ సబ్సిడీ వంటి ప్రభుత్వ సంబందిత ఆర్థిక ప్రయోజనాలను పొందలేరు. పాన్-ఆధార్ లింకు చేసే సమయంలో కచ్చితంగా రెండు కార్డుల్లోని పేరు, పుట్టిన తేదీ వివరాలు ఒకే విదంగా లేకపోతే కార్డుల లింకింగ్ సాధ్యపడకపోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఐదు నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం క్రింద చెప్పిన విధంగా చేయండి.

ఆధార్-పాన్ లింక్ విధానం:

  • ఐటి విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించండి.
  • ‘క్విక్ లింక్స్’ విభాగం కింద వెబ్‌పేజీకి ఎడమ వైపున ఉన్న ‘లింక్ ఆధార్‘పై క్లిక్ చేయండి.
  • ఆధార్ కార్డు ప్రకారం ఆధార్ నంబర్, మీ పేరు, పాన్ నెంబర్ వంటి వివరాలను నమోదు చేయండి.
  • పుట్టిన సంవత్సరం మాత్రమే మీ ఆధార్ కార్డులో ఉన్నట్లయితే కింద ఉన్న చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
  • అలాగే ‘నా ఆధార్ వివరాలను యుఐడిఏఐతో ధృవీకరించడానికి నేను అంగీకరిస్తున్నాను’ అనే బాక్స్ పై క్లిక్ చేయండి.
  • మీ స్క్రీన్‌పై క్యాప్చా కోడ్‌ను ఎంటర్ స్క్రీన్ పై క్లిక్ చేయండి
  • ఏదైనా దృశ్య లోపం ఉంటే వినియోగదారులు క్యాప్చా కోడ్‌కు బదులుగా వన్-టైమ్ పాస్‌వర్డ్ కోసం అభ్యర్థించవచ్చు.
  • ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ‘లింక్ ఆధార్’ బటన్ పై క్లిక్ చేస్తే ఇప్పుడు మీ ఆధార్, పాన్ లింక్ అవుతాయి.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here