ఆన్‌లైన్‌లో వెహికల్ పెండింగ్ చలాన్ చెల్లించడం ఎలా..?

0
Telangana-Traffic-police

మీ బండికి పెండింగ్ చలాన్ ఉందా? కారు చలాన్ ఇంకా కట్టలేదా? అయితే మీ కోసమే తెలంగాణ పోలీసులు సరికొత్త ఆఫర్‌తో మీ ముందుకొచ్చారు. పెండింగ్ చలాన్ కట్టాలనుకునే వారి కోసం బంపరాఫర్ ప్రకటించారు. భారీ తగ్గింపుతో పెండింగ్ చలాన్ క్లియర్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ద్విచక్ర వాహనాలు, కారు, బస్సులు, రవాణా వాహనాలకు వేర్వేరు శ్లాబుల్లో పెండింగ్ చలాన్ వసూలుకు సిద్ధమయ్యారు.

(ఇది కూడా చదవండి: ధరణీ ప్రభుత్వ నిషేధిత జాబితాలో నుంచి మీ భూమిని తొలగించడం ఎలా..?)

కొన్ని ఏళ్లుగా పేరుకుపోయిన పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు మార్చి 1 తేదీ నుంచి పోలీసు శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుంది.ఈ ప్రత్యేక డ్రైవ్’లో భాగంగా టూవీలర్స్‌ పెండింగ్ చలాన్లకు 75 శాతం రాయితీ ప్రకటించింది. కేవలం 25 శాతం చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని రద్దు చేయనున్నారు. అలాగే కార్లకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 30 శాతం, తోపుడుబండ్లకు 20 శాతం చెల్లింపులకు అవకాశం ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని మాఫీ చేయనున్నారు.

మొదటి రెండూ రోజుల్లోనే రూ.19 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు పోలీసు శాఖ ప్రకటించింది. మొదటి రోజు కొన్ని సాంకేతిక కారణాల వల్ల రూ.8 కోట్లు వసూలు అయితే, 2వ రోజు రూ.11 కోట్లకు పైగా వసూలు అయినట్లు తెలంగాణ పోలీసు శాఖ పేర్కొంది. ఆన్‌లైన్‌లో పెండింగ్ చలాన్ చెల్లించడం ఎలా అనే దాని గురించి ఈ క్రింది వీడియో చూడండి. ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి పెండింగ్ చలాన్ చెల్లించడానికి వాహన నెంబర్’తో పాటు ఇంజిన్/ఛాసిస్ నెంబర్ కూడా అవసరం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here