ఈ రెండు సెట్టింగ్స్ మారిస్తే మీ వాట్సప్ ఖాతా మరింత సురక్షితం

0

వాట్సాప్ మెసేజింగ్ సేవలను మన దేశంలో కనీసం 40 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. కొన్ని కొన్ని సార్లు మన వాట్సాప్ డేటా హ్యాక్ అయిపోతూ ఉంటుంది. దీనివల్ల మనకు తెలియకుండానే మన డేటా బయటి ప్రపంచానికి తెలిసిపోతుంది. ఒకవేల మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందని మీకు అనుమానంగా ఉంటే మీరు వెంటనే మీ ప్రైవసీ చెందిన రెండు సెట్టింగ్స్ మార్చేయండి. దీంతో మీరు మీ వాట్సప్‌ని చాలా సురక్షితంగా వాడుకోవచ్చు.

ఇంకా చదవండి: వాట్సాప్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిన కేంద్రం!

వాట్సాప్ ఇప్పుడు మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని వాట్సాప్ లో షేర్ చేసుకోవడంతో ఇప్పుడు ప్రతి చాట్‌ను తప్పక రక్షించుకోవాల్సి ఉంటుంది. మీ వాట్సప్‌ని సేఫ్‌గా ఉపయోగించాలంటే రెండు సెక్యూరిటీ ఫీచర్స్ ఎనేబుల్ చేయడం చాలా అవసరం. ఒకటి ఫింగర్ ప్రింట్ లాక్‌ కాగా.. మరొకటి టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఫీచర్స్. ఈ రెండు సెక్యూరిటీ ఫీచర్స్ ద్వారా మీ వాట్సాప్ చాట్ కి మరింత రక్షణ లభిస్తుంది.

టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్:

మొదట మనం వాట్సాప్ లో ఉన్న టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్(Two-Factor Authentication) ఫీచర్ ని ఎనేబుల్ చేసుకోవాలి. దీనికోసం మీ వాట్సాప్ ఖాతా తెరిచి కుడి మూలలో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి. ఇప్పుడు ‘సెట్టింగులు’ వెళ్ళండి. ఇక్కడ మీకు టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ ఆప్షన్ ను ఎంచుకున్న తర్వాత ఆరు అంకెల నంబర్ లేదా పిన్ ఎంటర్ చేయాలి. దీని ద్వారా మీ మొబైల్ పోయిన లేదా ఒకవేళ మీ వాట్సప్ ఎవరైనా హ్యాక్ చేసినా ఈ పిన్ లేకుండా యాప్ మాత్రం ఓపెన్ కాదు. అందుకే మీరు కూడా ఈ పిన్ నెంబర్ ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.

ఫింగర్ ప్రింట్ లాక్:

వాట్సాప్ ప్రారంభంలో ఈ ‘ఫింగర్ ప్రింట్ లాక్(Finger Print Lock)’ ఆప్షన్ లేదు. అందువల్ల మీ ఫోన్‌ను ఇతరులు తెరిచి మీ వాట్సాప్ ఖాతా చాట్ ను దొంగలించడం చాలా సులభం అయ్యేది. కానీ, ఇప్పుడు వాట్సాప్ మీ ఖాతాకు లాక్ వేసే ఆప్షన్ తీసుకొచ్చింది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ ప్రైవసీ సెట్టింగ్‌లకు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ‘ప్రైవసీ’ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు ‘ఫింగర్ ప్రింట్ లాక్’ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని మీరు ఎనేబుల్ చేయాలి చేస్తే సరిపోతుంది.

ఇంకా చదవండి: భవిష్యత్ లో ప్రపంచంలో రాబోయే భారీ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు ఇదే!

దీంతో మీ వాట్సాప్ ఖాతా ఓపెన్ చేసే ప్రతిసారి తప్పక మీ “ఫింగర్ ప్రింట్” తప్పనిసరిగా కావాలి. దీనివల్ల మీకు మీ ప్రైవేట్ సంభాషణలకు అపరిచితుల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ రెండు సెక్యూరిటీ ఫీచర్స్ ఎనేబుల్ చేశారంటే మీ వాట్సప్ ఇతరులు ఓపెన్ చేసి చూడటం సాధ్యం కాదు. మీ ఛాట్స్, ఫోటోలు, వీడియోలు అన్నీ సురక్షితంగానే ఉంటాయి.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here