How To Book Slot for Agriculture Land in Dharani Portal: తెలంగాణ ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ధరణి పోర్టల్‌ను అక్టోబర్ 29న ప్రారంభించింది. ఇకపై భూముల కొనుగోళ్లు, అమ్మకాలూ అన్నీ ఆ పోర్టల్ ద్వారానే జరుగుతాయి. అదెలాగో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ధరణి పోర్టల్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవడం ఎలా..?
మనం భూముల కొనుగోళ్లు, అమ్మకాలూ జరపాలన్న ముందుగా మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అందుకోసం తప్పనిసారిగా మనకు ఒక యూజర్ అకౌంటు కలిగి ఉండాలి. దాని కోసం New User Please Sign Up here అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ పేరు, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి అకౌంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు, మీరు Slot Booking For Citizens అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఇంత ముందు క్రియేట్ చేసిన అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వాలి. అక్కడ మీకు Application for Registration ( Gift & Sale) అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు Nature of Deed, Nature of Sub-Deed, PPB NUmber లు ఎంటర్ చేయాలి. మీరు ఇలా వివరాలు ఎంటర్ చేశాక మీకు అక్కడ మీ భూమికి సంబందించిన వివరాలు వస్తాయి.
అందులో మీరు అమ్మే లేదా బహుమానంగా ఇచ్చే సర్వే నెంబర్ ని ఎంచుకొని భూమి యొక్క 4 హద్దులు ఎంచుకోవాలి proceed అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ లేదా ఫామ్ 60, మీ పేరు , అడ్రెస్, మీ కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలి.
అలాగే, ఎవరికి మీరు అమ్ముతున్నారో లేదా బహుమానంగా ఇస్తున్నారో వారి వివరాలు కూడా సమర్పించాలి. తర్వాత మీకు పేమెంట్ పేజీ లో డబ్బులు కట్టిన తర్వాత మీకు ఒక Application Txn Number వస్తుంది దానిని మనం సేవ్ చచేసుకున్న తర్వాత స్లాట్ బుకింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి Application Txn Number ఎంటర్ చేసి ఏ రోజున మీరు వెళ్ళాలి అనుకుంటారో ఆ రోజున స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు.
(ఇది కూడా చదవండి: ధరణిలో ఖాతా విలీనం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?)
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.