ఫేక్ న్యూస్ కట్టడి కోసం ఐఐటీ విద్యార్దుల అద్భుత ఆవిష్కరణ

0

ప్రస్తుతం ఇంటర్ నెట్ లో నకిలీ వార్త ఏదో, నిజమైన వార్తా ఏదో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. చాలా మంది కొందరు సృష్టించిన తప్పుడు వార్తలను నిజమని నమ్ముతుంటారు. అయితే, నకిలీ వార్తల వ్యాప్తిని గుర్తించడం ప్రస్తుతం చాలా ముఖ్యం. వాటి కట్టడి కోసం నకిలీ వార్తలను గుర్తించే యాప్ ను కర్ణాటక ఐఐటి ధార్వాడ్ విద్యార్థులు రూపొందించారు. రెండు నెలల్లో లాంచ్ కానున్న ఈ యాప్ నకిలీ వార్తలను గుర్తించడానికి గొప్ప సాధనంగా ఉపయోగపడుతుందని తెలిపారు విద్యార్దులు.(చదవండి: రైతులకు మరో శుభవార్త తెలిపిన జగన్ ప్రభుత్వం)

ఈ ఆవిష్కరణకు సంబంధించిన సమాచారాన్ని విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఐఐటి ధార్వాడ్ విద్యార్దులు అయిన అమన్ మరియు అతని స్నేహితులు ఈ యాప్ యొక్క ఆవిష్కరణకు సహకరించారు. ఈ యాప్ నకిలీ వార్తలను గుర్తించడంలో సహాయపడటమే కాకుండా పాఠకులకు నిజాన్ని తెలియజేస్తుందని ఆయన అన్నారు. రెండు నెలల్లో లాంచ్ కాబోతున్న ఈ యాప్ తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేయడంలో సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఒక అద్భుత ఆవిష్కరణ అని మంత్రి అభినందించారు.

నకిలీ వార్తల సమస్య వారిని చాలా ఇబ్బంది పెట్టిన తరువాత, అమన్ మరియు అతని స్నేహితులు ఈ సమస్యకు పరిష్కారంగా ఒక యాప్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నామని అమన్ చెప్పారు. దీనిని ప్రారంభించిన తరువాత వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని తెలిపారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here