ఐఐటి గువహతి పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ

0

అంతరిక్ష కమ్యూనికేషన్ రంగంలో అత్యంత సురక్షితంగా సమాచారాన్ని బదిలీ చేసేందుకు గువహతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు “ఫ్రీ-స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ వ్యవస్థ”ను అభివృద్ధి చేశారు. పరిశోదకులు తెలిపిన ప్రకారం.. ఫ్రీ-స్పేస్ కమ్యూనికేషన్‌ వ్యవస్థ ద్వారా ‘వాయిస్, టెక్స్ట్ లేదా ఇమేజ్’ రూపంలో సమాచారాన్ని డేటా ఆప్టికల్ ఫైబర్స్ లాగా కాకుండా కాంతిని ఉపయోగించి ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ఇది రాబోయే కొత్త తరం కమ్యూనికేషన్ టెక్నాలజీని సూచిస్తుంది అని పేర్కొన్నారు. (చదవండి: భారత్ లో స్టార్‌లింక్‌ హై-స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలు)

పూర్తిగా ఏ విదంగా సమాచార మార్పిడి జరుగుతుందో ఇటీవల నేచర్ పబ్లిషింగ్ గ్రూపుకు చెందిన ప్రఖ్యాత జర్నల్ కమ్యూనికేషన్స్ ఫిజిక్స్ లో ప్రచురించబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అభివృద్ధి చేయబడిన చాలా ఫ్రీ-స్పేస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ డేటాను ఎన్కోడ్ చేయడానికి ‘వోర్టెక్స్ బీమ్’ అని పిలువబడే ఒక రకమైన కాంతి పుంజాన్ని ఉపయోగిస్తాయి. దీని వల్ల “తుపానుల సమయంలో, గాలిలో హెచ్చు తగ్గుల సమయంలో కొంత సమాచారం నష్ట పోయే ప్రమాదం ఉంది” అని బోసంతా రంజన్ బోరువా(ఐఐటి గువహతి భౌతికశాస్త్రవేత్త) చెప్పారు. అందుకే డేటాను ఎన్కోడ్ చేయడానికి మరియు సమాచారం నష్ట పోకుండా, వేగంగా ప్రసారం చేయడానికి “జెర్నికే మోడ్” పద్దతి ఉపయోగించినట్లు తెలిపారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here