Income Tax Returns: కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ఆర్ధిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు ఆధాయపన్ను రిటర్నుల దాఖలు గడువును పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2020 – 21 ఆర్దిక సంవత్సరానికి సంబంధించి వ్యక్తిగత రిటర్నుల దాఖలు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడగించినట్లు తెలిపింది. అలాగే, కంపెనీల రిటర్నుల దాఖలుకు సంబంధించి గడువును నవంబర్ 30 వరకు పొడగించినట్లు పేర్కొంది.(ఇది కూడా చదవండి: చిన్న చిన్న ట్విట్స్ తో 65 వేల కోట్ల ఏలోన్ మస్క్ సంపద ఆవిరి)
కరోనా మహమ్మరి వల్ల దేశంలోని అనేక రాష్ట్రాలలో కఠిన లాక్‌డౌన్ అమలు అవుతుంది. దీంతో పన్ను చెల్లింపుదారులకు కొంచెం ఊరట కల్పించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు వ్యక్తిగత లావాదేవీల రిటర్నుల దాఖలుకు జులై 31, కంపెనీలకు అక్టోబర్ 31 వరకు సీబీడీటీ గడువు విధించింది. అలాగే, కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసే ఫారం-16 గడువును కూడా సీబీడీటీ పొడిగించింది. జులై 15 వరకు ఇందుకు గడువుగా నిర్దేశించింది.
ఐటీ రిటర్న్స్ దాఖలు సులభతరం చేసేందుకు కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్‌ను కేంద్ర ఆదాయ పన్ను శాఖ అందుబాటులోకి తీసుకురాబోతుంది. పాత పోర్టల్ www.incometaxindiaefiling.gov.in స్థానంలో కొత్తపోర్టల్ www.incometaxgov.inను జూన్ 7 నుంచి తీసుకురాబోతున్నట్లు తెలిపింది. ఇక, జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు పాత పోర్టల్ పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉండదని ఐటీ శాఖ పేర్కొంది.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.