పోస్ట్ ఆఫీసు అకౌంట్ యూజర్లకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మరో శుభవార్త తెలిపింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ తన వినియోగదారుల కోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్టు(డిఓపీ)తో కలిసి డిజిటల్ పేమెంట్ అప్లికేషన్ ‘డాక్ పే’ యాప్ ని మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించింది. ‘డాక్ పే‘ యాప్ గురించి మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దీని ద్వారా కేవలం బ్యాంకింగ్ సేవలు, పోస్టల్ ప్రొడక్ట్స్‌ని ఆన్‌లైన్‌లో పొందడం మాత్రమే కాకుండా పోస్టల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ని ఇంటి దగ్గరే పొందవచ్చు అని అన్నారు.
ఇంకా చదవండి: ఇంట్లో నుండే ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోండి ఇలా..?
కోవిడ్-19 సమయంలో ఇటువంటి సేవలను తీసురావడానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ చేసిన కృషిని మంత్రి ప్రశంసించారు. ఆర్దిక లావాదేవీల కోసం దేశల ప్రజల్ని డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ యాప్ ఒక భాగం. దీనిని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొవచ్చు. దేశంలో ఎక్కడికైనా నగదును పంపించడం కోసం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పేమెంట్స్ చేయవచ్చు. వర్చువల్ డెబిట్ కార్డ్, యూపీఐ ద్వారా కూడా మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా తన సేవలు కొనసాగించడానికి ఒక పరీక్షగా నిలిచింది. ‘డాక్ పే‘ యాప్ ప్రారంభించడంతో ఐపీపీబీ యూజర్లకు మంచి శుభవార్త అందించింది. ఏ బ్యాంకు కస్టమర్లు అయినా డాక్ పే యాప్ తో బ్యాంకింగ్ సేవలతో పాటు బిల్ పేమెంట్ సేవలు పొందొచ్చు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ని Subscribe చేసుకోండి.