వాట్సాప్ జనవరి 4న కొత్త ప్రైవసీ పాలసీ నిబందనలను తెచ్చిన సంగతి మనకు తెలిసిందే. కొత్తగా తీసుకొచ్చిన వాట్సాప్ ప్రైవసీ పాలసీ నిబందనలను అంగీకరించిన నేపథ్యంలో ఖాతాను తొలిగిస్తామని ప్రకటించింది. అప్పటి నుంచి వాట్సాప్ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. వాట్సాప్ పోటీదారులైన సిగ్నల్ యాప్, టెలిగ్రామ్ యాప్ లకు యూజర్లు తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సాప్ చివరికి వెనక్కి తగ్గాలసి వచ్చింది. 2021 మే 15కు కొత్త నిబందనలను వాయదా వేయాల్సి వచ్చింది.
ఇంకా చదవండి: భవిష్యత్ లో ప్రపంచంలో రాబోయే భారీ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు ఇదే!
వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ నిబందనలపై కేంద్రం స్పందించింది. వాట్సాప్ వెంటనే కొత్త ప్రైవసీ నిబందనలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. భారతదేశంలోని ప్రజల యొక్క వ్యక్తిగత సమాచార గోప్యత, డేటా భద్రతను గౌరవించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్‌కు లేఖ రాసింది. నిబందనలను అంగీకరించకపోతే వాట్సాప్ ఖాతాను తొలగిస్తామనే షరతులను సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ(MEITY) తప్పు బట్టింది. ఈ సంధర్భంగా జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(2017) కేసును ప్రస్తావించింది. ప్రజల ప్రైవసీ, అంగీకార సూత్రాలకు విలువ ఇవ్వాలనే సుప్రీంకోర్టు తీర్పును వాట్సాప్ దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేసింది.
వాట్సప్ ఖాతా యూజర్ల డేటాను పంచుకోవడం ఫేస్‌బుక్ తో షేర్ చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. ఒక సేవ కోసం సేకరించిన డేటాను మరొక సేవల కోసం పంచుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. వేర్వేరు వినియోగదారుల కోసం వాట్సాప్ విభిన్న విధానాలను కలిగి ఉందని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఉదాహరణకు యూరోపియన్ యూనియన్ లో వాట్సాప్ నిబందనలను అంగీకరించాలనే షరతులను అమలు చేయలేదు అని పేర్కొంది. ఈ లేఖలో వాట్సాప్ ద్వారా యూజర్ డేటాను ఎలా ఉపయోగించుకుంటుంది, ఎలాంటి గోప్యత రక్షణలను అందిస్తుంది అనే దానిపై 14 ప్రశ్నలు అడిగింది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.