ఏపీ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు శుభవార్త తెలిపింది. సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీని ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది. దీనికి సంబందించిన ప్రకటనను ఇంటర్ విద్య బోర్డ్ కార్యదర్శి వి.రామకృష్ణ విడుదల చేశారు. భవిష్యత్ మరల పొడగించే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్దులు సకాలంలో పరీక్ష ఫీజులు చెల్లించాలని ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు పేర్కొంది. జనరల్, ఒకేషనల్ రెండో ఏడాది రెగ్యులర్, ప్రవేటు విద్యార్థులకు పొడిగింపు వర్తింస్తుందని ఆయన పేర్కొన్నారు. గతేడాది పరీక్ష తప్పిన విద్యార్థులకు.. హాజరు మినహాయింపున్న ఆర్ట్స్ విద్యార్థులకు వెసులుబాటు ఇస్తున్నామని ఆయన అన్నారు. గ్రూప్ మార్చుకొనే విద్యార్థులకు ఫిబ్రవరి 18 వరకు పరీక్ష ఫీజులు చెల్లించొచ్చని ఆయన పేర్కొన్నారు.(ఇది చదవండి: ప్రపంచంలో ఖరీదైన కంప్యూటర్ ధర ఎంతో తెలుసా?)

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.