ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ కు ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. మార్కెట్లోకి వచ్చిన క్షణాల్లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతాయి. ఆపిల్ గత ఏడాది ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. దీంతో ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లపై భారీగా తగ్గింపును ప్రకటించింది. ఐఫోన్ 12 బేసిక్ మోడల్‌పై సుమారు రూ.9,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఐఫోన్ 12 సిరీస్ మొబైల్ మోడళ్లపై ఈ భారీ తగ్గింపును ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ నుంచి పొందవచ్చు.
అమెజాన్ తన కస్టమర్లకు ఐఫోన్ 12 బేసిక్ మోడల్(64జీబీ) రూ.70,900కు అందిస్తుంది. ఐఫోన్ 12 బేసిక్ అసలు ధర రూ.79,900. 128 జీబీ ఐఫోన్ 12 మోడల్ పై సుమారు రూ.5,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కాగా 256 జీబీ వేరియంట్‌పై ఆపిల్ ఏలాంటి ఆఫర్‌ను అందించడం లేదు. ఐఫోన్ 12 మినీ వేరియంట్ పై సుమారు రూ.6,000 వరకు తగ్గించింది. అంతేకాకుండా అమెజాన్ పే, లేదా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు నుంచి కొనుగోలు చేస్తే రూ.400 క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది.
Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.