IPL 2021: రిలయన్స్ జియో ఐపీఎల్ 2021 సందర్భంగా తన యూజర్లకు సరికొత్త ఆఫర్లు ప్రకటించింది. కొన్ని ప్రత్యేక రీచార్జ్ ప్లాన్లను రిచార్జ్ చేసుకోవడం ద్వారా ఉచితంగా కాలింగ్,డేటాతో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. దీంతో ఉచితంగానే ఐపీఎల్ మ్యాచ్ లు చూసుకునే అవకాశం లభిస్తుంది. దీంతోపాటు జియో క్రికెట్ ప్లే అలాంగ్ యాప్ ద్వారా క్రికెట్ ఫ్యాన్స్ తమ ఎమోషన్స్‌ను ఎమెజీ స్టిక్కర్ల ద్వారా తెలపడంతో పాటు క్రికెట్ ఆధారిత క్విజ్‌లో కూడా పాల్గొనవచ్చు.
ఈ మ్యాచ్‌లను లైవ్‌లో వీక్షించాలంటే రూ.399 విలువైన డిస్నీప్లస్ హాట్ స్టార్ వీఐపీ సభ్యత్వం ఉండాలి. ఐపీఎల్ నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రత్యేకంగా ఎంచుకోవడం ద్వారా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ వార్షిక సబ్ స్క్రిషన్‌ను కూడా జియో అందిస్తోంది. ఈ అన్ని ప్లాన్స్‌కు డిస్నీ + హాట్‌స్టార్‌తో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియోక్లౌడ్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు.

జియో క్రికెట్ ప్లాన్స్:
రూ.401 ప్లాన్: 28 రోజుల వ్యాలిడిటీ, ప్రతి రోజు 3 జీబీ డేటా (6 జీబీ అదనపు డేటా), అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్.
రూ.598 ప్లాన్: 56 రోజుల వ్యాలిడిటీ, ప్రతి రోజు 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్.
రూ.777 ప్లాన్: 84 రోజుల వ్యాలిడిటీ, ప్రతి రోజు 1.5 జీబీ డేటా (5 జీబీ అదనపు డేటా), అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్.
రూ.2,599 ప్లాన్: 365 రోజుల వ్యాలిడిటీ, ప్రతి రోజు 2 జీబీ డేటా (10 జీబీ అదనపు డేటా), అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.