పబ్ జీ గేమ్ మళ్ళీ భారత్ లోకి వచ్చేస్తోందా?

0

ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న అన్నీ అతిపెద్ద టెక్ కంపెనీలకు భారతదేశం కీలకమైన మార్కెట్. అందుకే భారత ప్రభుత్వం పబ్ జీ మొబైల్‌ను నిషేధించిన తరువాత పరిణామాలు చాలా ధారుణంగా ఉన్నాయి. ఒక సర్వే ప్రకారం, భారతదేశంలో నిషేధం కారణంగా PUBG యొక్క ప్రపంచ డౌన్‌లోడ్‌లు సెప్టెంబర్‌లో 26 శాతానికి పైగా తగ్గాయి. ఒక్కసారిగా PUBG మొబైల్ స్థానం టాప్ యాప్స్ జాబితా నుండి కిందకు పడిపోతుంది. అందుకని, ఈ గేమింగ్ యాప్ మళ్ళీ భారత్ లోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దీనికోసం కొరియా కేంద్రంగా పనిచేస్తున్న పబ్ జీ కార్పొరేషన్, భారతి ఎయిర్‌టెల్‌ మధ్య దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు ఎన్‌ట్రాకర్ సంస్థ రిపోర్ట్ చేసింది. అయితే, ఆ చర్చలు మొదటి దశలోనే ఉన్నట్టు తెలిపింది.(చదవండి: ప్రపంచంలోనే మొట్టమొదటి SLED 4K TVని లాంచ్ చేసిన రియల్ మీ)

అలాగే, గేమింగ్ అభివృద్ది కోసం 4 నుండి 6 సంవత్సరాల లోపు అనుభవం ఉన్న భారత్ టెక్ నిపుణులను ఇంటర్వ్యూ చేస్తోంది. గతంలో రిలయన్స్ యాజమాన్యంలోని జియో ప్లాట్‌ఫామ్‌లతో కొరియా కంపెనీ చర్చలు చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. చైనాతో సరిహద్దు విబేధాల తర్వాత, దేశ రక్షణ అంశంలో పబ్ జీ సహా పలు చైనీస్ కంపెనీలను భారత్ బ్యాన్ చేసింది. భారత్ బ్యాన్ చేసిన తర్వాత పబ్ జీ డౌన్ లోడ్స్ భారీగా పడిపోయాయి.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here