- రెండు దశలు విజయవంతం
- మూడవ దశలో సాంకేతిక లోపం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్(జీఎస్‌ఎల్‌వీ)-ఎఫ్10 ప్రయోగం ఫెయిల్ అయ్యింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆగస్టు 12న ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10ని అంతరిక్షంలోకి ప్రయోగించారు. బుధవారం ఉదయం 3.43 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ నిరంతరాయంగా 26 గంటల కొనసాగాక అంతరిక్ష వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. రెండు దశల వరకు విజయవంతంగా నిగ్గిలోకి దూసుకెళ్లిన రాకెట్‌లో క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ దశలో సాంకేతిక లోపం తలెత్తింది.
ఈ లోపం వల్ల ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో జీఎస్‌ఎల్‌వీ పయనించింది. దీంతో తీవ్ర నిరాశకు గురయిన ఇస్రో శాస్త్రవేత్తలు.. లైవ్‌సోర్స్‌ను నిలిపి వేశారు. ఆ తర్వాత జీఎస్ఎల్వీ మిషన్ విఫలమైనట్టు ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు. జీఐశాట్-1 ఉపగ్రాహన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తున భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాలని శాస్త్రవేత్తలు భావించారు. కానీ, అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. భారత భూపరిశీలన ఉపగ్రహాల్లో కీలకంగా భావిస్తోన్న జీఐశాట్-1 గత ఏడాది మార్చిలోనే ప్రయోగించాలని నిర్ణయించారు. అయినప్పటికీ సాంకేతిక కారణాలతో ఈప్రయోగం రెండు సార్లు వాయిదా పడింది. సుమారు 2,275 కిలోల బరువున్న జీశాట్-1 అత్యాధునిక భూ పర్యవేక్షిత ఉపగ్రహం. దేశ రక్షణ వ్యవస్థకు తోడ్పాటునందించడంతో పాటు విపత్తుల సమాచారాన్ని ముందుగా తెలుసుకోవడమే జీశాట్ ప్రధాన ఉద్దేశం. ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌ను తొలిసారిగా భూస్థిర కక్ష్యలోకి పంపాలని ఇస్రో భావించింది.