ఒకప్పుడు కొంత దూరానికి కూడా పొగ రైళ్లలో రోజుల తరబడి ప్రయాణించేవాళ్లం. ఇప్పుడు కొన్ని గంటల్లోనే సుదూర గమ్యాలను చేరుకునే అవకాశం అందుబాటులో ఉంది. మన దేశంలో అత్యధిక వేగంతో ప్రయాణించే వందే భారత్ వేగం వచ్చేసి కేవలం 180 కి.మీ మాత్రమే. ప్రస్తుతం వందే భారత్ రైలు తప్ప మిగతా సూపర్ ఫాస్ట్ ట్రైన్ స్పీడ్ వచ్చేసి కేవలం గంటకు 80 కి.మీ వేగంతో మాత్రమే ప్రయాణిస్తున్నాయి.
అదే ప్రపంచ విషయానికి వస్తే అత్యంత వేగంతో ప్రయాణించిన రికార్డు చైనాకు చెందిన షాంఘై మాగ్లేవ్ రైలు(430 కి.మీ/గం) పేరు మీద ఉంది. భవిష్యత్ లో ఎటువంటి చక్రాలు లేకుండా అయస్కాంత సహాయంతో గంటకు 603 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించే రైళ్లు భవిష్యత్ లో రాబోతున్నాయి. అలాగే మరో ముఖ్య విషయం ఏమిటంటే ప్రస్తుతం ఉన్న రైళ్ల కంటే వీటిలో భద్రత చాలా ఎక్కువ. ప్రపంచంలో మొట్టమొదటి హైస్పీడ్ రైల్వే వ్యవస్థను 1964లో జపాన్ నిర్మించింది. కాగా, జపాన్‌కు చెందిన జపనీస్ మాగ్లేవ్ రైలు(గంటకు 603 కి.మీ) పట్టాలెక్కితే ఇదే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా రికార్డులకెక్కనుంది.
ఇంకా చదవండి: ప్రపంచంలోనే భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్.. ఇది పది కాళేశ్వరాలతో సమానం!
మాగ్లేవ్ రైళ్లు ఎలా పనిచేస్తాయి?
భవిష్యత్ లో ఇటువంటి సూపర్ కండక్టింగ్ మాగ్నెటిక్ రైళ్లను తీసుకురావడానికి 1970 నుంచి జపాన్ కు చెందిన సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ, రైల్వే టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్నాయి. మాగ్లెవ్ రైళ్లు కార్లు, ట్రాక్ మధ్య అయస్కాంత వికర్షణ సూత్రం ఆధారంగా రైళ్లు పనిచేస్తాయి. మాగ్లెవ్ అనే పదం వాస్తవానికి “మాగ్నెటిక్”, “లెవిటేషన్” అనే పదాల కలయిక. ఎలెక్ట్రోడైనమిక్ సస్పెన్షన్ సిస్టమ్ ద్వారా రైలు యొక్క అయస్కాంత లెవిటేషన్ వల్ల ట్రాక్ పై రైలు తేలియాడుతూ ప్రయాణిస్తుంది. రైలు పట్టాలకూ- ఇంజిన్ అడుగుభాగంలో ఉండే అయస్కాంతశక్తి ఆధారంగా ఈ రైళ్లు నడుస్తాయని… వీటితో ఎలాంటి కాలుష్యం ఉండదని పరిశోధకులు తెలిపారు. అంతేకాక ఈ రైళ్లకు ఎలాంటి ప్రమాద ముప్పూ లేదు.
మాగ్లెవ్ టాప్ స్పీడ్?
21 ఏప్రిల్ 2015న జపనీస్ బుల్లెట్ రైలు మాగ్లేవ్ పరీక్ష దశలో మౌంట్ ఫుజి సమీపంలో గంటకు 603 కిలోమీటర్ల(375 మైళ్ళ) వేగంతో ప్రయాణించి ఒక కొత్త ప్రపంచ స్పీడ్ రికార్డు ను సృష్టించింది. ఇప్పటికే షాంఘై, చైనా, దక్షిణ కొరియాలో నడుస్తున్న మాగ్లేవ్ రైళ్ల వేగం కంటే ఇది చాలా ఎక్కువ. కొత్త సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కారణంగా భవిష్యత్ రైళ్లు మరింత ఎక్కువ వేగంగా ప్రయాణించనున్నాయి.

మీకు తెలుసా? అరవై సంవత్సరాల కాలంలో జపాన్ యొక్క హై-స్పీడ్ రైలు మార్గాల ప్రమాదాల శాతం సున్నాకు చేరుకుంది. ఇవి ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన రవాణా మార్గాలలో ఒకటిగా నిలిచాయి. మాగ్లెవ్ రైల్ కూడా ప్రమాదరహితంగా తయారుచేయాలని పరిశోధకులు భావిస్తున్నారు.
ఇంకా చదవండి: ఎలన్ మస్క్(సిగ్నల్), మార్క్ జూకర్‌బర్గ్ (వాట్సాప్) మధ్య ఘర్షణకు కారణం ఏమిటి?
జపనీస్ మాగ్లెవ్ రైలు మార్గం
2009లో మాగ్లెవ్ రైలు వ్యవస్థకు ఆమోదం లభించింది. తర్వాత వాణిజ్య పరంగా నిర్మాణంలోకి ప్రవేశించింది. 2027 నాటికి టోక్యో, నాగోయ నగరాలను అనుసంధానించడానికి “చువో షింకన్సేన్” లైన్ ప్రణాళికను రూపొందించారు. మాగ్లెవ్ రైలు ద్వారా 350 కిలోమీటర్ల దూరాన్ని కేవలం నలభై నిమిషాల చేరుకొనున్నారు. ఈ ప్రతిపాదిత మార్గంలో షినగావా, సాగమిహారా, కోఫు, ఐడా, మరియు నకాట్సుగావ స్టేషన్లలో స్టాప్‌లు ఉంటాయి.

టోక్యో నుంచి ఒసాకా వెళ్లే 500 కిలోమీటర్ల మార్గాన్ని ఒక గంటలోపు ప్రయాణించే విదంగా రైలును తయారు చేయడమే మాగ్లేవ్ ప్రాజెక్ట్ యొక్క అసలు లక్ష్యం. మాగ్లెవ్ లైన్ నాగోయా నుంచి ఒసాకాకు 2045 నాటికి తీసుకురానున్నారు. 286 కిలోమీటర్ల (177 మైళ్ళు) మాగ్లేవ్ బుల్లెట్ రైలు ట్రాక్‌లో ఎనభై శాతం భూగర్భంలో ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు 55 బిలియన్ డాలర్ల(4 లక్షల కోట్లు) ఖర్చు కానున్నట్లు సమాచారం. మాగ్లెవ్ రైళ్లు ప్రస్తుతం ప్రపంచ రికార్డులను సృష్టిస్తున్నాయి. జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే న్యూయార్క్, వాషింగ్టన్ మధ్య మాగ్లెవ్ లైన్ నిర్మించడానికి ఈ టెక్నాలజీని అమెరికాకు విక్రయించాలని ప్రతిపాదించారు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.