బ్రిటిష్‌ రాజకుటుంబం కంటే రెండింతల ఆస్తితో జెఫ్‌ బెజోస్‌ రిటైర్డ్‌..!

0

ప్రపంచ కుబేరుడు, అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ జూలై 05న అమెజాన్‌ సీఈఓ పదివికి గుడ్‌బై చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ కంపెనీ కొత్త సీఈవోగా ఆండీ జాస్సీ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో ప్రజలు ఎక్కువగా ఆన్‌లైన్ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడంతో 2020లో అమెజాన్ గణనీయంగా లాభాలను గడించింది. దీంతో అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్‌ బెజోస్ వ్యక్తిగత సంపద కూడా గణనీయంగా పెరిగింది. సుమారు 2020 సంవత్సరంలో 75 బిలియన్ డాలర్లకు చేరింది.

జెఫ్‌ బెజోస్‌ 1994 జూలై 5న తొలిసారిగా అమెజాన్‌లో ఆన్‌లైన్‌ ద్వారా పుస్తకాలను విక్రయించడం మొదలుపెట్టాడు. మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడినప్పటికి తర్వాత కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరారు. ప్రస్తుతం బెజోస్‌ బ్లూ ఆరిజిన్‌ సంస్థ చేపట్టే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఇక జెఫ్‌ బెజోస్‌ సంపద విషయానికొస్తే.. బెజోస్ మొత్తం బ్రిటిష్ రాజకుటుంబ సంపద కంటే రెండింతలు ఎక్కువ సంపదతో పదవి విరమణ తీసుకున్నారు.

బ్రిటిష్ రాజకుటుంబం సంపద విలువ సుమారు 88 బిలియన్‌ డాలర్లను కలిగి ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. జెఫ్ బెజోస్ నికర ఆస్తుల విలువ 203 బిలియన్ల డాలర్లు(మన దేశ కరెన్సీలో రూ.15 లక్షల కోట్లు). 2018 నుంచి 2020 వరకు బిల్ గేట్స్ నికర ఆస్తి విలువ రూ .6.12 లక్షల కోట్ల నుంచి రూ .8.58 లక్షల కోట్లకు ఏగబాకింది. ఒక నివేదిక ప్రకారం, కేవలం రెండూ ఏళ్లలోనే అతని సంపద 73 శాతం పెరిగింది.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here