సెప్టెంబర్‌ 10న మార్కెట్లోకి రానున్న చౌక జియో స్మార్ట్‌ఫోన్‌

0

టెక్‌ దిగ్గజం గూగుల్‌తో కలిసి రూపొందించిన ప్రపంచంలో అత్యంత చౌకైన 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ముకేశ్‌ అంబానీ ఆవిష్కరించారు. సెప్టెంబర్‌ 10న గణేష్ చతుర్థి సందర్భంగా ఇది మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. జియోఫోన్‌ నెక్ట్స్‌ పేరిట దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మొబైల్ ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్‌ ఫోన్‌ కాగలదని ఆయన పేర్కొన్నారు. ‘భారత్‌ను 2జీ విముక్త దేశంగా మార్చాలంటే అత్యంత చౌకైన 4జీ స్మార్ట్‌ఫోన్‌ అవసరం. ప్రత్యేకంగా భారత మార్కెట్‌ కోసం జియో, గూగుల్‌ కలిసి జియోఫోన్‌ నెక్ట్స్‌ రూపొందించాయి‘ అని అంబానీ తెలిపారు.

చౌకైన 4జీ స్మార్ట్‌ఫోన్‌ కోసం ప్రత్యేకమైన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేసినట్లు ఏజీఎంలో వర్చువల్‌గా పాల్గొన్న గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. 5జీకి సంబంధించి కూడా గూగుల్‌ క్లౌడ్, జియో జట్టు కట్టాయని ఆయన వివరించారు. దాదాపు 30 కోట్ల మంది యూజర్లకు చేరువయ్యేందుకు చౌక స్మార్ట్‌ఫోన్‌ రిలయన్స్‌కి ఉపయోగపడగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అయితే, అంతిమంగా ధర, పనితీరు కీలకంగా ఉంటుందని పేర్కొన్నాయి. కరోనా వైరస్‌కు పూర్వం భారత మార్కెట్లో రూ. 5,000 పైగా రేటున్న స్మార్ట్‌ఫోన్ల సెగ్మెంట్‌ వాటా అయిదు శాతమేనని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ తెలిపారు.దీనిలో వాయిస్ అసిస్టెంట్, ఆగ్యుమెంటెడ్ రియాలిటీతో పనిచేయనున్న కెమెరా, లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ వంటి మరెన్నో ఫీచర్స్ తీసుకొనివచ్చింది.

5జీ ముందుగా మేమే తీసుకోస్తాం..

దేశీయంగా పూర్తి స్థాయిలో 5జీ సర్వీసులను తమ కంపెనీయే ముందుగా అందుబాటులోకి తెస్తుందని అంబానీ ధీమా వ్యక్తం చేశారు. ఇతర భాగస్వాములతో కలిసి దేశీయంగా రూపొందించిన 5జీ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు తెలిపారు. ఈ పరీక్షలో 1 జీబీపీఎస్‌ స్పీడ్‌తో పనిచేసినట్లు చెప్పా రు. దేశవ్యాప్తంగా తమ డేటా సెంటర్లలో, నవీ ముంబైలోని ట్రయల్‌ సైట్లలో 5జీ నెట్‌వర్క్‌ను ఇన్‌స్టాల్‌ చేసినట్లు అంబానీ పేర్కొన్నారు.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here