దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త ఏడాదిలో తన వినియోగదారులకు శుభవార్త తెలిపింది. భారతదేశంలోని జీయో యూజర్లు ఇతర టెలికాం నెట్‌వర్క్‌లకు చేసిన వాయిస్ కాల్స్ జనవరి 1 నుండి పూర్తిగా ఉచితం అని పేర్కొంది. టెలికాం రెగ్యులేటర్ జనవరి 1 నుండి ప్రత్యర్థి నెట్‌వర్క్‌లకు టెర్మినోస్ ఛార్జీలు విధించాల్సిన అవసరం లేదని టెలికాం రెగ్యులేటర్ ఆదేశించినందుకు గాను జియో కాల్స్‌కు చార్జీలను వసూలు చేయకూడదని నిర్ణయానికి వచ్చింది.
ఇంకా చదవండి: 2021 నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో నిలిచిపోనున్న వాట్సప్ సేవలు
గతంలో ఇతర టెలికాం నెట్‌వర్క్‌లకు కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు డిసెంబర్ 31 వరకు వసూలు చేసుకోవచ్చు అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నిర్ణయించింది. 2019 సెప్టెంబరులో ట్రాయ్ నిబందనల ప్రకారం జనవరి 1 నుండి దేశంలో బిల్-అండ్-కీప్ పాలన అమలు చేయబడుతోంది. దీంతో దేశీయ వాయిస్ కాల్స్ కోసం ఐయుసి (ఇంటర్ కనెక్షన్ యూసెజ్ ఛార్జ్) తొలగించబడుతుంది” అని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తెలిపింది. బిల్-అండ్-కీప్ నిబందనల ప్రకారం టెలికం ఆపరేటర్లు ఒకరికొకరు ముగింపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో జియో ట్రాయ్ ఐయూసీ చార్జీలను తొలగించేంత వరకే వీటిని వసూలు చేస్తామని పేర్కొంది. ఇప్పుడు తాజాగా జియో ఐయూసీ చార్జీలను తొలగించి మాట నిలబెట్టుకుంది. ఈ ప్రభావం ప్రత్యర్డీ కంపెనీల మీద పడనుంది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.