జియో నుంచి మరో సంచలనం..! త్వరలోనే లాంచ్‌..!

0

టెలికాం రంగంలో సంచలనాలను నమోదు చేసిన జియో ఇప్పుడు మరో సంచలనానికి సిద్దం అవుతుంది. రిలయన్స్‌ 44వ ఏజీఎమ్‌ సమావేశంలో అతి తక్కువ ధరకే జియో ఫోన్‌ నెక్ట్స్‌ను ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే, అప్పుడు జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ కూడా ప్రకటిస్తుందని అంచనా వేశారు. కానీ, ఏజీఎమ్‌ సమావేశంలో రిలయన్స్‌ జియోబుక్‌ గురించి ఏలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా భారత మార్కెట్లో జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ను మరి కొద్ది రోజుల్లోనే లాంచ్‌ చేయడానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది.(చదవండి: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో.. వాటిపై 80 శాతం మేర భారీ తగ్గింపు..!)

బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) వెబ్‌సైట్‌లో సర్టిఫికేషన్‌ కోసం జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ ఈ మధ్య వచ్చినట్లు తెలుస్తోంది. జియో నుంచి రాబోయే మూడు ల్యాప్‌టాప్‌ వేరియంట్లు బీఐఎస్‌ సర్టిఫికేషన్‌ సైట్‌లో కంపెనీ లిస్ట్‌ చేసింది. అయితే, జియో ల్యాప్‌టాప్‌ లాంచ్‌ డేట్‌ మాత్రం ఇంకా కన్ఫర్మ్‌ అవ్వలేదు. జియోబుక్‌ 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీతో పనిచేస్తుందని తెలుస్తోంది. ఇది స్నాప్‌డ్రాగన్‌ 664 ప్రాసెసర్‌, 4జీబీ ఎల్‌పీడీడీఆర్‌ఎక్స్‌ ర్యామ్‌, 64 జీబీ రామ్‌ స్టోరేజ్‌తో రానుంది. జియోబుక్‌ ధర రూ.20 వేల కంటే తక్కువకు వచ్చే అవకాశం ఉన్నట్లు టెక్‌ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జియోబుక్‌ ల్యాప్‌టాప్‌ ఫీచర్స్

  • హెచ్‌డీ(1,366×768 పిక్సెల్స్) డిస్‌ప్లే
  • స్నాప్‌డ్రాగన్‌ 664 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌
  • 4జీబీ ర్యామ్‌+64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • మినీ హెచ్‌డీఎమ్‌ఐ కనెక్టర్‌
  • డ్యూయల్‌బ్యాండ్‌ వైఫై
  • బ్లూటూత్‌ సపోర్ట్‌
  • ప్రీ ఇన్‌స్టాల్‌డ్‌ జియో యాప్స్‌
  • మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌, ఆఫీస్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here