దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటువంటి సమయంలో టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారులకు బాసటగా నిలచెందుకు ప్రత్యేకంగా రెండు కార్యక్రమాలను ప్రకటించింది. ఇటువంటి అపత్కల సమయంలో జియో ఫోన్ యూజర్లకు ఉచిత ఔట్‌గోయింగ్ కాల్స్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. కరోనా విపత్తు ముగిసే వరకు నెలకు 300 నిమిషాల ఉచిత ఔట్‌గోయింగ్ కాల్స్ (రోజుకు10 నిమిషాలు) ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. (ఇది కూడా చదవండి: తెలంగాణ: ఈ-పాస్ కోసం ధరఖాస్తు చేసుకోవడం ఎలా?)
అలాగే, జియో ఫోన్ వినియోగదారు రీఛార్జ్ చేసిన ప్రతి ప్లాన్‌ఫై అంతే సమానమైన రీఛార్జ్ వాల్యూను ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది. ఉదాహరణకు 75 రూపాయల ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ఉచితంగా జియోఫోన్ యూజర్ అదనంగా మరో 75 రూపాయల ప్లాన్ ప్రయోజనాలను పొందవచ్చు. ఇందుకోసం రిలయన్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది.
ప్రతీ భారతీయ పౌరుడికి డిజిటల్ లైఫ్ అందించే లక్ష్యంతో జియోఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం.. ప్రస్తుత మహమ్మారి సంక్షోభ కాలంలో వారికి అందుబాటు ధరలో, నిరంతరం సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు జియో వెల్లడించింది. ఈ కాలంలో రీఛార్జ్ చేయించుకోలేక పోయిన జియోఫోన్ వినియోగదారులకు ఈ పథకాలు తోడుగా నిలుస్తాయని తెలిపింది.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.