ప్రధాన మంత్రి నరేంద్రమోడీ లాక్ డౌన్ కాలంలో పిలుపునిచ్చిన “ఆత్మ నిర్భర్ భారత్” విశేష ఆధారణ లభిస్తుంది. “ఆత్మ నిర్భర భారత్” కింద రూపొందించిన మొబైల్ యాప్ లకు విశేష ప్రజాధరణ లభిస్తుంది. ట్విటర్ కి పోటీగా తీసుకొచ్చిన స్వదేశీ “కూ” యాప్ డౌన్లోడ్ పరంగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం ‘కూ’ యాప్‌నకు ముప్ఫై లక్షలకు పైగా యూజర్లు ఉన్నారు. కేవలం ఒక వారంలోనే ఈ యాప్ డౌన్‌లోడ్ల సంఖ్య ఏకంగా పది రెట్లు పెరిగింది అంటే మనం అర్ధం చేసుకువచ్చు.(ఇది చదవండి: ప్రపంచంలో ఖరీదైన కంప్యూటర్ ధర ఎంతో తెలుసా?)
విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను కట్టడి చేయాలన్న ఆదేశాలను ట్విటర్ పట్టించుకోవకపోవడంతో దానిపై అసంతృప్తిని వ్యక్తం చేయడానికి కేంద్ర ఐటీ శాఖ కూడా ‘కూ’ యాప్‌నే ఎంచుకుంది. ఈ నేపథ్యంలో భారతీయ వ్యవస్థాపకులు, దేశీయంగా రిజిస్ట్రేషన్‌తో పూర్తి దేశీ యాప్‌గా “కూ” కొద్ది రోజులుగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రులు మొదలుకుని వివిధ ప్రభుత్వ శాఖలు కూడా దీన్ని ప్రోత్సహిస్తూ ప్రచారం చేస్తున్నాయి. పీయూష్ గోయల్ లాంటి కేంద్ర మంత్రులు సైతం ‘కూ’ యాప్‌నకు మళ్లాలంటూ పిలుపునివ్వడంతో.. దీనికి మరింతగా ప్రాచుర్యం పెరిగింది.
మైక్రోబ్లాగింగ్ స్వదేశీ “కూ” సైట్ వ్యవస్థాపకులు అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిద్వత్కా లతో స్థాపించబడింది. రాధాకృష్ణ ఇంతక ముందు ఆన్ లైన్ క్యాబ్ బుకింగ్ సర్వీస్ ట్యాక్సీఫర్ ష్యూర్ ను స్థాపించారు, దీనిని తరువాత ఓలా క్యాబ్స్ కు విక్రయించారు. “కూ” కు ముందు దాని మాతృ సంస్థ బాంబినేట్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్ చేత 2017లో ప్రాంతీయ భాషల్లో “Quora” లాంటి ఆన్‌లైన్ ప్రశ్నోత్తరాల ప్లాట్‌ఫాం వోకల్‌ను ప్రారంభించారు.(ఇది చదవండి: సెక్యూరిటీ ఆలర్ట్: ఈ యాప్ ను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి?)
క్రంచ్ బేస్ నుంచి సేకరించిన డేటా ప్రకారం.. కంపెనీ బ్లూమ్ వెంచర్స్, కలారి క్యాపిటల్, యాక్సెల్ పార్టనర్స్ ఇండియా పెట్టుబడిదారుల నుంచి 2018లో సీరిస్ A ఫండింగ్ ను సేకరించింది. ఆ తర్వాత ‘కూ’ ప్లాట్‌ఫామ్‌ను గతేడాది ఆవిష్కరించారు. యూజర్లు భారతీయ భాషల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వేదికగా దీన్ని రూపొందించారు.
తెలుగు, హిందీ, బెంగాలీ సహా పలు ప్రాంతీయ భాషలను ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ నెల ప్రారంభంలో ప్రకటించిన తాజా రౌండ్ ఫండింగ్ లో, మాజీ ఇన్ఫోసిస్ CFO TV మోహన్ దాస్ పాయ్ యొక్క 3one4 క్యాపిటల్ కూడా బాంబినేట్ టెక్నాలజీస్ లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది. గత వారమే యాక్సెల్, కలారి క్యాపిటల్, బ్లూమ్ వెంచర్స్, డ్రీమ్ ఇన్‌క్యుబేటర్, 3వన్4 క్యాపిటల్ తదితర సంస్థలు ‘కూ’లో ఇన్వెస్ట్ చేశాయి.
కొద్ది రోజుల క్రితం ఒక ఫ్రెంచ్ హ్యాకర్ “కూ” యాప్ డేటా లీక్ అవుతున్నట్లు ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు. “నేను ఈ కొత్త “కూ” యాప్ మీద 30 నిమిషాలు గడిపాను. ఈ యాప్ తన యూజర్ల వ్యక్తిగత డేటాను లీక్ చేస్తోంది: ఇమెయిల్, డాబ్, పేరు, వైవాహిక స్థితి, జెండర్” వంటివి లీక్ అవుతున్నట్లు తెలపడంతో పాటు ఇది చైనాకు చెందిన కంపెనీ అని పేర్కొన్నాడు.
దీనికి ప్రతిస్పందించిన రాధాకృష్ణ ఎక్కువ మంది ఒకేసారి లాగిన్ కావడంతో సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించినట్లు తెలిపాడు. గతంలో వోకల్ అనే ఉత్పత్తి కోసం ‘కూ’ లో ఇన్వెస్ట్ చేసిన చైనా కంపెనీ షున్‌వై .. కొత్త ఇన్వెస్టర్లకు వాటాలను విక్రయించి రెండు నెలల్లో పూర్తిగా వైదొలగనుందని ఆయన వివరించారు. ‘ఇప్పటికే “కూ”లో పెట్టుబడులు పెట్టిన 3వన్4 క్యాపిటల్, కలారి తదితర సంస్థలు కూడా మరికొంత వాటాలు కొనుగోలు చేయనున్నాయి’ అని రాధాకృష్ణ తెలిపారు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.