యూపీఐతో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లిస్తున్నారా? అయితే, జర జాగ్రత్త!

0
Credit Card
Credit Card Payments

ప్రస్తుత ఆధునిక యుగంలో మనలో చాలా మంది క్రెడిట్‌ కార్డులు వాడుతున్న సంగతి మనకి తెలిసిందే. గతంలో బ్యాంకులు క్రెడిట్‌ కార్డు జారీ చేయాలంటే చాలా ప్రాసెస్‌ ఉండేది. కానీ, ఇప్పుడు సులభంగా మారిపోయింది. కేవలం ఫోన్‌ ద్వారానా వివరాలు తెలుసుకుని ఆధార్‌ వివరాలతో కార్డును బ్యాంకులు జారీ చేస్తున్నాయి.

అయితే, అలాంటి క్రెడిట్‌ కార్డు బిల్లులను సమయానికి చెల్లించకపోతే ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం చాలా మంది యూపీఐ సహాయంతో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లిస్తున్నారు. అయితే, మీ క్రెడిట్ కార్డు బిల్లులను పేటీఎమ్, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చెల్లించేటప్పుడు ప్రతి ఒక్కరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి.

(ఇది కూడా చదవండి: Credit Card Withdrawal Charges: క్రెడిట్ కార్డుతో ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా?)

మీ బిల్ డ్యూ డేట్ కి ఒక రోజు ముందు యూపీఐ ద్వారా గనుక క్రెడిట్ బిల్ చేస్తే మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే, మీరు గనుక యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే కొన్ని సార్లు ఆ బిల్ మీ క్రెడిట్ ఖాతాలో జమ కావడానికి కొన్ని సార్లు ఎక్కువ సమయం పడుతుంది. అందుకని, ఇక నుంచి మీరు యూపీఐ ద్వారా బిల్ పేమెంట్ చేసటప్పుడు క్రెడిట్ కార్డు బిల్ డ్యూ డేట్ కి మూడు రోజుల ముందు మాత్రామే చెల్లింపులు చేయండి.

అప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డ్ ఆలస్య రుసుము నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఇంకా క్రెడిట్ కార్డుకు సంబందించి మీరు కొన్ని ముఖ్య విషయాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటి!

చెల్లింపు గడువు తేదీ: ముఖ్యంగా కార్డులోని డబ్బులు వాడుకున్న తర్వాత చెల్లింపు గడువును గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చెల్లింపు తేదీ గడిచిపోతే మీరు ఆలస్య రుసుము ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.

మొత్తం బిల్లు ఒకేసారి చెల్లిస్తే మంచిది: క్రెడిట్‌ కార్డు బిల్లు మొత్తం చెల్లిస్తే ఎలాంటి సమస్య ఉండదు. అందులో పూర్తిగా చెల్లించకుండా సగం సగం చెల్లించినట్లయితే మీరు అప్పుల్లో కూరుకుపోవాల్సి ఉంటుంది. ఆ బిల్లు మొత్తంపై వడ్డీ విధిస్తాయి బ్యాంకులు. అలాగే మినిమమ్‌ బిల్లులు చెల్లించినా మీకు పెనాల్టీ విధిస్తుంటాయి.

వడ్డీ పడకూడదంటే: బ్యాంకులు క్రెడిట్‌ కార్డు జారీ చేసే సమయంలో కస్టమర్‌కు 45-50 రోజుల వడ్డీ రహిత వ్యవధిని ఇస్తారు. ఈ కాలంలో బకాయి మొత్తం అదనపు ఛార్జీ లేకుండా చెల్లించవచ్చు. కానీ ఆ సమయం దాటి బిల్లు చెల్లిస్తే మాత్రం 34 శాతం నుంచి 40 శాతం వరకు అధిక వడ్డీ రేటుతో చెల్లించాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here