గృహ కొనుగోలుదారులకు ఎల్‌ఐసీ శుభవార్త!

0

మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్ ఆతి తక్కవ వడ్డీ రేట్లకే గృహరుణాలను అందిస్తున్నట్టు ప్రకటించింది. రూ.50 లక్షల వరకు గృహ రుణాలపై, గరిష్టంగా 30 ఏళ్ల కాలానికి తీసుకునే రుణాలపై వడ్డీ రేటును 6.66 శాతానికి తగ్గించినట్టు శుక్రవారం ప్రకటించింది. సవరించిన వడ్డీ రేట్లు ఆగస్ట్‌ 31 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. వడ్డీ రేటు రుణ గ్రహీతల క్రెడిట్‌ స్కోర్‌పై మీద ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.

‘కరోనా ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని ఆకర్షణీయమైన వడ్డీ రేటును ప్రవేశపెట్టాం. తాజా రేట్ల తగ్గింపు వల్ల వినియోగదారుల్లో విశ్వాసం పుంజుకుంటుంది. ఈ రంగం త్వరగా కోలుకోగలదు” అని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఎండీ, సీఈవో వై విశ్వనాథ్‌ గౌడ్‌ పేర్కొన్నారు. అలాగే, దరఖాస్తు కోసం ఎల్‌ఐసీ కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నారు. ఇంట్లో నుంచే ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్ చెందిన
LIC HFL Home Loans(HomY App) యాప్ ద్వారా గృహ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. మీ అప్లికేషన్ స్టేటస్ కూడా ట్రాక్ చేయవచ్చు అని తెలిపారు.

Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here