మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? మీ సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువగా ఉందా? అయితే మీకు అదిరిపోయే ఒక శుభవార్త. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సిబిల్ స్కోర్ 700 కంటే ఎక్కువ ఉన్నవారికి తక్కువ వడ్డీరేటుతో గృహ రుణాలు(Home Loan) అందిస్తోంది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కొత్త గృహ రుణాలు(Home Loan) తీసుకోవాలనే వారి కోసం వడ్డీ రేటును 6.90 శాతానికి తగ్గించింది. గృహ రుణాలపై ఇది ఇప్పటివరకు అతి తక్కువ వడ్డీ రేటు. సిబిల్ స్కోరు 700 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న కస్టమర్లు ఈ తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణం లభిస్తుంది.
రుణ పరిమితి ఎంత?
సిబిల్ స్కోరు అనేది ఒక వ్యక్తి ఇంతకు ముందు రుణం తీసుకున్నాడా? ఒకవేళ రుణం తీసుకున్నట్లయితే సకాలంలో చెల్లించాడా అనే దానిపై స్కోరు ఆధారపడి ఉంటుంది. సిబిల్ స్కోర్లను తనిఖీ చేసేటప్పుడు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రకారం.. సిబిల్ స్కోరు 700 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఖాతాదారులకు రూ.50 లక్షల రుణంపై వడ్డీ రేటు 6.90 శాతంతో ప్రారంభమవుతుంది. అదే స్కోరుతో రూ.80 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకునే వారికి 7 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.