తెలంగాణలో లాక్‌డౌన్‌?.. నేడు ప్రభుత్వం కీలక నిర్ణయం

0
Lockdown In Telangana

రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ విధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు రంజాన్‌ పండుగ(శుక్రవారం) మరుసటి రోజు నుంచి అంటే.. ఈ నెల 15 తర్వాత సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలో సగానికి పైగా రాష్ట్రాలు ఇప్పటికే తమ రాష్ట్రాలలో లాక్‌డౌన్‌ విధించాయి.

నేడు మంత్రివర్గ భేటీ

సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నేడు(మంగళవారం) ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనున్నది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించే విషయంపై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించినా కూడా కరోనా ఆశించిన మేరకు తగ్గుతలేదని, సరియైన ఫలితాలు రావట్లేదని రిపోర్టులు అందుతున్నవి.

ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధింపుపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొన్ని వర్గాల ప్రజలు లాక్‌డౌన్‌ కావాలని కోరుకుంటే, మరికొన్ని వర్గాల ప్రజలు వద్దని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ విధించడం వల్ల కలిగే కష్టానష్టాలతో పాటు, రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోల్ల ప్రక్రియ మీద లాక్‌డౌన్‌ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే అంశంపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొనున్నారు.(ఇది కూడా చదవండి: ప్రైవేట్ టీచర్లకు, రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!)

ప్రజలు నిర్లక్ష్యం వల్లే..

లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బ తింటుందని, పేదలకు ఉపాధి కరువవుతుందని, లాక్‌డౌన్‌ విధించిన రాష్ట్రాల్లోనూ పెద్దగా ఆశించిన ఫలితాలు కన్పించడం లేదని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే కర్ఫ్యూలేని పగలంతా ప్రజలు స్వీయ నియంత్రణ లేకుండా వ్యవహరించడం, కనీస భౌతిక దూరం పాటించకుండా ప్రభుత్వం ఎంతగా హెచ్చరిస్తున్నా మాస్క్‌లు సైతం పెట్టుకో కుండా నిర్లక్ష్యంగా వ్యవరించడం వల్ల మున్ముందు పరిస్థితులు చేయి దాటే ప్రమాదం ఉందనే భావనకు ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం కరోనా వేగంగా విస్తరించే అవకాశాలున్నాయని జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వైద్యరంగ నిపుణుల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం లాక్‌డౌన్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here