ఇండియా విడుదలైన తొలి ఎలక్ట్రిక్ కారు ఏదో తెలుసా?

0

పూర్వ కాలం నుంచి ఆటోమొబైల్ రంగంలో ఇండియా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం కారు తయారీ రంగంలో ఇతర దేశాల దీటుగా దేశీయ కారు సంస్థలు సరికొత్త కార్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ సరికొత్త కార్లను తీసుకొస్తున్నప్పటికి ఆటోమొబైల్ రంగం ఆరంభంలో చాలా కొత్త ప్రయోగలే చేసింది. అప్పుడు మానవ శక్తి వనరుల ఆధారంగా కార్లను డిజైన్ చేసింది.(ఇది చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేని హైదరాబాద్ ఎలక్ట్రిక్ బైక్)

భారత దేశంలో ఎప్పటి నుంచో ఎలక్ట్రిక్ కార్లను తీసుకురావాలని చాలా మంది ప్రయత్నించి విపలమయ్యారు. కానీ, ఒక కంపెనీ విదేశీ సహకారంతో చివరకి 1993లో ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. ఆ ఎలక్ట్రిక్ కారు పేరు ‘ద లవ్ బర్డ్’. దీనిని ఎడ్డీ ఎలక్ట్రిక్ సిరీస్ అనే కంపెనీ తయారు చేసింది. అప్పట్లో ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పోలో ఈ వాహనాన్ని ప్రదర్శించారు. ఈ ఈవెంట్ లో కొన్ని అవార్డులు కూడా వారు అందుకున్నారు. భారత ప్రభుత్వం కూడా ఈ కారుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

జపాన్ లోని టోక్యోకు చెందిన యాస్కావా ఎలక్ట్రిక్ ఎమ్ ఎఫ్ జి కంపెనీ సహకారంతో ఎడ్డీ కరెంట్ కంట్రోల్స్(ఇండియా) లిమిటెడ్ దీనిని తయారు చేసింది. ఈ కారును తమిళనాడులోని చలకుడి, కేరళ, కోయంబత్తూరు ప్రాంతాల్లో నిర్మించారు. ఇది టూ సీటర్ కారుమాత్రమే. కార్ మోటార్ రీఛార్జెబుల్ బ్యాటరీతో నడిచేది. బ్యాటరీ ప్యాక్ లు అప్పట్లో అంత అడ్వాన్స్ గా లేవు కాబట్టి, లెడ్-యాసిడ్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించారు. బ్యాటరీ పవర్ గురించి ఎలాంటి సమాచారం లేదు.(ఇది చదవండి: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, మైలేజ్ ఎంతో తెలుసా?)

నాలుగు గేర్లు ముందుకు ఒక రివర్స్ గేర్ తో ఇతర కార్లకు ధీటుగా పోటీగా వచ్చింది. ఫుల్ ఛార్జ్ పెడితే 60 కిలోమీటర్ల వరకూ ప్రయాణించేది. పట్టణ ప్రయాణీకుల కోసమే ప్రత్యేకంగా తయారు చేశారు. కొద్ది రోజుల తర్వాత కారు ఉష్ణోగ్రత 15డిగ్రీల దాటితే ప్రయాణించకూడదని ప్రభుత్వ ఆంక్షలు పెట్టింది. అందుకే కార్ల ప్రొడక్షన్ ఆగిపోయింది. పెట్రోల్, డీజిల్ సీఎన్జీ కార్ల మార్కెట్ నడుస్తున్న సమయంలో పోటీ ఇవ్వలేకపోయింది.

ఎందుకు నిలిపివేశారు?

ఒకవైపు ఎలక్ట్రిక్ సప్లైలో ఫెయిల్యూర్స్ మరొకపైపు ప్రభుత్వం ఎలక్ట్రిక్ కార్ కొనుగోళ్లకు ఇచ్చే సబ్సిడీ నిలిపివేయడంతో ఇది ఖరీదైన కారుగా మారింది. ఆ సమయంలో వచ్చిన మారుతీ సుజుకీ 800మార్కెట్ ని ఒక ఊపు ఉపేసింది. మిగిలిన వాటికంటే బెస్ట్ సర్వీస్ అందించడం మొదలుపెట్టింది. దీనితో లవ్ బర్డ్ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు మూడు అంకెల ఫిగర్ ను దాటలేదు.(ఇది చదవండి: హీరో ఎలక్ట్రిక్ సంచలనం: సింగిల్ చార్జ్ తో 200 కి.మీ ప్రయాణం)

ప్రస్తుతం మనం గమనించినట్లయితే ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. ఇంత ఆధునిక కాలంలోనే వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు అంటే మనం అర్ధం చేసుకోవచ్చు. అప్పట్లే ఆ కారు ఎందుకు ఫెయిల్ అయ్యిందో. ప్రస్తుతం టాటా, ఎంజి, మహీంద్రా, హ్యుందాయ్ కంపెనీలు ఎలక్ట్రిక్ ఎస్ యూవీలను మార్కెట్లో అందిస్తున్నాయి.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here