మళ్లీ పెరిగిన ఎల్పీజీ వంట గ్యాస్ ధరలు

0

సామాన్యులకు చమురు మార్కెటింగ్ సంస్థలు షాక్ ఇచ్చాయి. మరోసారి ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ ధరపై రూ.25 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కేవలం నెల రోజుల్లో వంట గ్యాస్ పై రూ.125 పెంచాయి. ఇప్పటికీ పెట్రోల్ ధరలు పెరుగుతున్న కారణంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా పెరిగిన గ్యాస్ ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయి. ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.794 నుంచి రూ.819కు చేరుకుంది.(ఇది చదవండి: అమెజాన్ క్విజ్‌లో పాల్గొని రూ.10వేలు గెలుచుకోండి!)

ఫిబ్రవరి 4న గ్యాస్ సిలిండర్ ధర రూ.25 పెరగ్గా.. 15వ తేదీన రూ.50, 25వ తేదీన రూ.25 పెరిగింది. ఇప్పటి వరకూ 4 వారాల వ్యవధిలోనే సిలిండర్ ధర రూ.125 పెరగడం సామాన్యుడికి భారంగా పరిణమిస్తోంది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.871.50 పైసలకు చేరింది. 2020 నవంబర్ నుంచి ఇప్పటి వరకు రూ.225 పెరిగింది. ఇంకా వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్ ధరను రూ.95 పెంచాయి. తాజా నిర్ణయంతో ఒక కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,614కు చేరుకుంది.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here