ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త..!

0

దేశంలోని ఎల్‌పీజీ వినియోగ‌దారుల‌కు కేంద్ర పెట్రోలియం, స‌హ‌జ‌వాయువు మంత్రిత్వ శాఖ శుభ‌వార్త అందించింది. ఇక‌పై ఏ గ్యాస్ కంపెనీకి చెందిన వినియోగదారులైన స‌రే వేరే గ్యాస్ కంపెనీ డీల‌ర్ నుంచి రీఫిల్ సిలిండ‌ర్ ను బుక్ చేయవచ్చు. ఈ మేర‌కు మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద చండీగ‌ఢ్‌, కోయంబ‌త్తూర్‌, గుర్గావ్‌, పూణె, రాంచి గ్యాస్ వినియోగ‌దారుల‌కు ఈ స‌దుపాయం ముందుగా అందుబాటులోకి వస్తుంది. తర్వాత ఇందులో ఎదురైన సమస్యలు పరిష్కరించి దేశమంత‌టా ఈ స‌దుపాయాన్ని అందిస్తారు. దీనివల్ల ఎంతో మందికి ప్రయోజనం ఉంటుందని ఆ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.(ఇది కూడా చదవండి: కేజీ మట్టి ఖరీదు ఆరున్నర లక్షల కోట్లు?)

ఇప్ప‌టి వ‌ర‌కు ఏ కంపెనీకి చెందిన వినియోగదారులు ఆ కంపెనీకి చెందిన డీల‌ర్ వ‌ద్దే రీఫిల్ సిలిండ‌ర్‌ల‌ను బుక్ చేసుకోవాల్సి ఉండేది. కానీ కేంద్రం కొత్తగా తీసుకునిరాబోయే ఈ స‌దుపాయం వ‌ల్ల ప్రజలు గ్యాస్ సిలిండ‌ర్ ఏ కంపెనీకి చెందిన‌ది అయినా స‌రే ఇంకో కంపెనీ గ్యాస్ సిలిండ‌ర్‌ను పొంద‌వ‌చ్చు. సాధార‌ణంగా కొన్ని ప్రాంతాలలో ఒకే కంపెనీకి చెందిన గ్యాస్ ఏజెన్సీలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. దీంతో వేరే గ్యాస్ కంపెనీల‌కు చెందిన ప్ర‌జ‌లు రీఫిల్ సిలిండ‌ర్ల బుకింగ్ కోసం అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. అయితే దేశ‌మంత‌టా ఈ స‌దుపాయాన్ని ఎప్ప‌టి నుంచి అమ‌లులోకి తీసుకొస్తారో చూడాలి.

Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here