LPG Domestic Cylinder Price Hike: దేశంలో వంట గ్యాస్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరల పేరుగుదలతో సామాన్యుడు బ్రతుకు జీవుడా అంటూ జీవనం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోసారి ఎల్‌పీజీ వంట గ్యాస్ ధరలు పెరగడంతో మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లు ఉంది సామాన్యుడి పరిస్థితి. ఆయిల్ కంపెనీలు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరలను రూ.15 మేర పెంచాయి.
ప్రస్తుతం ధరల పేరుగుదలతో ఢిల్లీలో సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్(Subsidy Gas Price) ధర రూ.884.50 నుంచి 899.50కి పెరిగింది. ఇక హైదరాబాద్లో ఇండియన్ గ్యాస్ ధర రూ.937 నుంచి రూ.952కి పెరిగింది. ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ కంపెనీలు సిలిండర్ ధరలను సవరిస్తూ ఉంటాయి. అక్టోబర్ 1వ తేదీన కూడా గ్యాస్ ధరలను సవరించాయి. కమర్షియల్ గ్యాస్ ఎల్పీజీ ధరలను పెంచింది. ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ ధరలను కూడా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి.(చదవండి: ఏపీలో రేషన్ కార్డు దారులకు అలర్ట్.. వారికి రేషన్ బంద్!)
గ్యాస్ ధరలను పెంచడానికి రెండు కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం ఒక కారణంగా అయితే. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా గ్యాస్ రేట్ పెరుగుతున్నట్టు చెబుతున్నారు.
ప్రస్తుతం 14.2 కేజీల సబ్సిడీ గ్యాస్ ధర
నగరం | ధర |
హైదరాబాద్ | రూ.952 |
వరంగల్ | రూ.971 |
కరీంనగర్ | రూ.971 |
విజయవాడ | రూ.923.50 |
విశాఖపట్నం | రూ.908.5 |
తిరుపతి | రూ.934 |