ఒక పక్క పెట్రో ధరల భారీగా పేరుగుతుంటే, ఇప్పుడు మరో భారం సామాన్యుల మీద పడనుంది. ఎల్‌పీజీ వంట గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు భారీ షాక్ ఇచ్చాయి. దేశీయంగా సబ్సిడీయేతర ఎల్‌పీజీ సిలిండర్ల ధరను రూ.25 పెంచాయి. దీంతో 14.2 కిలోల దేశీయ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీ మార్కెట్లో 834.50 రూపాయలుగా ఉంది. అలాగే వాణిజ్య సిలిండర్ ధరను రూ.84 పెంచాయి. ఒక పక్క మండుతున్న పెట్రో ధరలను చూసి సామాన్యుడు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడితే, ఇప్పుడు ఈ ధరల పెంపుతో ఇంట్లో ఏమి వండే లేని పరిస్థితి ఏర్పడింది.
కొత్తగా సవరించిన రేటు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు గత ఏడాది నవంబర్ నుంచి పెరుగతూనే వస్తున్నాయి. 2020 నవంబర్ లో హైదరాబాద్‌లో రూ.646 ఉన్న సిలిండర్ల ధర నేడు రూ.887లుగా ఉంది. ఈ ఏడాదిలో మొదట ఫిబ్రవరి 4న సిలిండర్‌కు రూ.25 పెంచితే, ఫిబ్రవరి 15న రూ.50, ఫిబ్రవరి 25, మార్చి 1న రూ .25 పెంచారు. ఏప్రిల్‌లో రూ .10 తగ్గితే, మే-జూన్ నెలల్లో ధరలో మార్పు లేదు. మొత్తంగా కేవలం ఆరు నెలల్లో ఎల్‌పీజీ ధర 14.2 కిలోల సిలిండర్‌కు 140 రూపాయలు పెంచారు.
Support Tech Patashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.