వాట్సాప్‌కు పోటీగా స్వదేశీ సందేశ్ యాప్.. అద్భుతమైన ఫీచర్స్

0

Sandes App: వాట్సాప్ ఈ ఏడాది ప్రారంభంలో కొత్తగా ప్రైవసీ పాలసీ నిబందనలు తీసుకొచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ప్రైవసీ పాలసీపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకిత మొదలైంది. అయితే, మన దేశంలో కూడా చాలా మంది ఇతర మెసేజింగ్ యాప్స్ వాడటం మొదలు పెట్టారు. దీనితో భారత ప్రభుత్వం ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం సందేశ్ యాప్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. అలాగే సందేశ్ యాప్ నుంచి డేటా చోరీ, గోప్యతను ఉల్లంఘించే అవకాశాలు చాలా తక్కువ. మరోవైపు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో లేని కొన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఈ సందేశ్ యాప్‌లో మీ పుట్టిన తేదీ, చిరునామా, మెయిల్, జాబ్ లాంటి పలు వ్యక్తిగత విషయాలను ఇందులో నమోదు చేసుకోవచ్చు. ఇటువంటి లక్షణాలు మీరు వాట్సాప్‌లో పొందలేరు.
  • మీరు సందేశ్ యాప్‌లో లాగిన్ అవ్వడానికి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత మెయిల్ ద్వారా అయిన లాగిన కావొచ్చు. మీ బంధువులు, మిత్రులతో కూడా మెయిల్ ద్వారా కనెక్ట్ కావొచ్చు. ప్రస్తుతం ఈ ఆప్షన్ కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంది.
  • ఇక వాట్సాప్‌లో లేని చాట్‌బాట్‌ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా సందేశ్‌ యాప్‌లో ఏదైనా సమస్యను ఎదుర్కొంటే Help అని టైప్ చేస్తే దాన్ని పరిష్కరించడానికి చాట్‌బాట్ సిద్ధంగా ఉంది. కొన్ని కమాండ్స్ ద్వారా వాటిని ఎంచుకోవచ్చు.
  • వాట్సాప్‌లో త్వరలో తీసుకురాబోయే లాగౌట్ ఫీచర్ ప్రస్తుతం సందేశ్ యాప్‌లో ఉంది. దీని ద్వారా మీరు సందేశ్ యాప్ నుంచి మీకు నచ్చినంత కాలం విరామం తీసుకోవచ్చు.
  • ఇందులో వాట్సాప్‌లో లేని ట్యాగ్ అనే ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా చాట్ యొక్క ప్రాధాన్యతను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం Confidential, Priority, Auto Delete అనే ట్యాగ్స్ అందుబాటులో ఉన్నాయి.

కానీ, వాట్సాప్‌లో అందుబాటులో ఉండే లొకేషన్ షేర్, స్టేటస్ షేర్ అనే రెండు ఆప్షన్ లు మాత్రం అందుబాటులో లేవు. అలాగే స్టిక్కర్ లు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించినవి ఎక్కువ ఉన్నాయి. మీరు ఇక్కడ సందేశ్ యాప్ లింకు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here