శుక్రవారం, సెప్టెంబర్ 22, 2023

MG Comet EV: అదిరిపోయిన ఎంజీ కామెట్ ఈవీ రేంజ్.. ధర ఎంతో తెలుసా?

MG Comet EV Price in India: ఎంజి మోటార్ ఇండియా ఇటీవల తన కామెట్ (Comet) ఎలక్ట్రిక్ కారుని మార్కెట్లోకి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎంజీ కామెట్ ఈవీ లాంచ్ సమయంలో కంపెనీ కేవలం ప్రారంభ ధరలను మాత్రమే వెల్లడించింది. ఇప్పుడు వివిధ వేరియంట్స్, వాటి ధరలను కూడా అధికారికంగా విడుదల చేసింది. అయితే, వాటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

ఎంజీ కామెట్ ఈవీ వివిధ వేరియంట్స్ వాటి ధరలు:

  • పేస్(Pace): రూ. 7.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • ప్లే(Play): రూ. 9.28 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • ప్లస్(Plus): రూ. 9.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)

ఈ ధర కేవలం మొదటి 5,000 బుకింగ్‌లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. MG కామెట్ EV కారును మే 15, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ఛానెల్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

ఎంజీ కామెట్ ఈవీ రేంజ్:

కామెట్ EV ప్రిస్మాటిక్ సెల్‌లతో 17.3kWh li-ion బ్యాటరీని కలిగి ఉంది. ఈ కారు 230km రేంజ్ అందిస్తుంది. వేరియంట్స్ బట్టి రేంజ్ మారుతుంది అనే విషయం గుర్తుంచుకోవాలి.

(ఇది కూడా చదవండి: Top 5 Electric Scooter Under 1 Lakh: రూ.లక్ష కన్నా తక్కువకే లభిస్తున్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!)

MG కామెట్ EV భద్రత:

భద్రత పరంగా MG కామెట్ EVలో రీన్‌ఫోర్స్‌మెంట్ కోసం 17 హాట్ స్టాంపింగ్ ప్యానెల్‌లు ఉన్నాయి.

MG కామెట్ EV ఫీచర్స్:

  • వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే ఉన్నాయి.
  • మూడు డ్రైవ్ మోడ్‌లు మరియు మూడు కైనెటిక్ ఎనర్జీ రికవరీ సిస్టమ్ (KERS) మోడ్‌లు
  • ఇది 42 bhp పవర్ అండ్ 110 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
  • కామెట్ 3.3 కిలోవాట్ ఆన్ బోర్డ్ ఛార్జర్తో 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి లేదు గంటల సమయం పడుతుంది.
  • దీనిలో ఇద్దరు వ్యక్తుల కోసం షేరింగ్ ఫంక్షన్‌తో డిజిటల్ బ్లూటూత్ కీ ఉంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

Telugu