ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు జాగ్రత్త!

0

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్  వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ హెచ్చరిచింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను లక్ష్యంగా చేసుకుని దాడి చేసే కొత్త రాన్సమ్‌వేర్ వైరస్ ను కనుగొన్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. నివేదికల ప్రకారం, ఈ రాన్సమ్‌వేర్ ని మాల్‌లాకర్‌.బి(MalLocker.B) అని పిలుస్తారు. మాల్‌లాకర్‌.బి(MalLocker.B) వైరస్ ఆన్‌లైన్ ఫోరమ్‌లు మరియు వెబ్‌సైట్‌ల ద్వారా Android ఫోన్‌లపై దాడి చేస్తుందని తెలిపింది. అత్యంత ప్రమాదకరమైన ఈ MalLocker.B వైరస్ చాలా సందర్భాలలో Android యాప్స్ లో దాగి ఉంటుంది కాబట్టి వెబ్‌సైట్ల నుండి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మైక్రోసాఫ్ట్ సూచించింది. మాల్‌వేర్ కోడ్‌ సులువుగా చాలా‌ ఫోన్స్‌కు విస్తరిస్తుందని చెప్పింది. యూజర్లు ఎవరైనా సరే తెలియని సోర్స్‌ నుంచి యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేయకుండా ఉండాలని సూచించింది. అయితే, వ్యక్తిగత సమాచారం తస్కరిస్తుందనే దానికి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. (చదవండి: వారం రోజుల్లో 84 లక్షలు సంపాదించిన టెక్ డిజైనర్)

ఈ వైరస్ ఒక్కసారి మీ ఫోన్ లో ప్రవేశించిన తర్వాత ఫోన్ స్క్రీన్‌ను యాక్సెస్ చేయకుండా MalLocker.B వినియోగదారుని అడ్డుకుంటుంది. ఇతర రాన్సమ్‌వేర్ మాదిరిగా కాకుండా, MalLocker.B ఫోన్ ను ఎన్‌క్రిప్ట్‌ చేయదు. కానీ దానికి బదులు ఇది ఫోన్ స్క్రీన్‌ను నిలిచిపోయేలా చేస్తుంది. అయితే స్క్రీన్ లాక్ ని ఆన్ లాక్ చేయాలంటే కొత్త డబ్బును కట్టాలని సూచిస్తుంది. నివేదికల ప్రకారం, MalLocker.B ‘కాల్’ నోటిఫికేషన్ ని అవకాశంగా తీసుకుని రాన్సమ్‌వేర్‌ దాడి చేస్తుంది. ఆ సమయంలో యూజర్‌ తన ఫోన్‌ హోం బటన్‌నుగాని, యాప్‌ బటన్‌ను గానీ నొక్కడం వల్ల సంక్షిప్త సందేశంతో లాక్‌ పడిపోతుంది. కొత్త రాన్సమ్‌వేర్‌ వైరస్ వల్ల ఫైల్స్‌కు ఏమీ ఇబ్బంది లేకపోయినా.. డిస్‌ప్లే ఓపెన్‌ కాకపోవడంతోపాటు జరిమానా చెల్లించాల్సి వస్తుందని మైక్రోసాఫ్ట్‌ వివరించింది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here