అన్నదాతలకు తీపికబురు.. అకౌంట్లలోకి రూ.2,000!

0

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ప్రతి ఒక్క రంగం కూడా నష్టాలలో కూరకపోయాయి. అలాగే, కరోనా వైరస్ కారణంగా కష్టాల్లో చిక్కుకున్న రైతాంగానికి మోదీ ప్రభుత్వం ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి ప్రయ త్నిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనా కింద… రైతులకు డిసెంబర్ 1 నుంచి రూ.2,000 చెల్లించడానికి కేంద్రం సిద్దం అవుతుంది. కేంద్ర ప్రభుత్వ డైరక్ట్ బెనిఫిట్ ట్రాన్ఫర్ ప్రక్రియలో భాగంగా మరో ఐదు రోజుల్లో రైతులకు డబ్బు బదిలీ చేయనున్నారు. (చదవండి: తెలంగాణ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చిన హైకోర్టు)

రైతులందరూ పీఎం కిసాన్ పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో చేరడానికి మీరు మీ దగ్గరలోని వ్యవసాయ అధికారులను సంప్రదించడం ఈ పథకంలో చేరవచ్చు. మీరు కూడా స్వయంగా వెబ్ సైట్ లోకి వెళ్ళి ధరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో చేరడానికి రైతులకు కచ్చితంగా పొలం పాస్ బుక్ ఉండాలి. అలాగే 5 ఎకరాలలోపు పొలం కలిగి ఉండాలి. పొలం విస్తీర్ణం ఎక్కువ ఉంటే ఈ పథకానికి అనర్హులు. ఇంకా బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఈ మూడు డాక్యుమెంట్లు ఉంటే ఈజీగానే స్కీమ్‌లో చేరవచ్చు.

ఒక వేల మీరు పథకంలో చేరిన కూడా డబ్బులు రాకపోతే మీ మండల, జిల్లా వ్యవసాయ అధికారులను సంప్రదించండి. అప్పటికి వీరు కూడా మీ సమస్యను పరిష్కరించలేకపోతే.. అప్పుడు హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయొచ్చు. లేదంటే pmkisan-ict@gov.inకు మెయిల్ కూడా పంపొచ్చు.

పీఎం కిసాాన్ హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే!

  • PM Kisan Toll-Free Number: 18001155266
  • PM Kisan Helpline Number: 155261
  • PM Kisan Landline Numbers: 011-23381092, 23382401
  • PM Kisan New Helpline: 011-24300606
  • PM Kisan Helpline: 0120-6025109

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here