మీడ్ రేంజ్ విభాగంలో మోటో జీ 5జీ మొబైల్ ని ఇండియాలో విడుదల చేసింది. ఇంకా చాలా కంపెనీలు 5జీ తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగా మోటో 5జీ మొబైల్ సరసమైన ధరకే తీసుకొచ్చింది. ఇప్పటి వరకు చాలా కంపెనీలు హై-ఎండ్ మరియు ప్రీమియం విభాగంలోని ఫోన్‌లలో మాత్రమే 5జీ మొబైల్ ని తీసుకొచ్చాయి. మోటోరోలా మాత్రం 5జీ మొబైల్ ని అతి తక్కువ ధరలో తీసుకొచ్చింది. మోటో జీ 5జీ మొబైల్ ను భారత్ లో రూ.20,999 వద్ద లాంచ్ చేసింది. మోటో జీ 5జీ 6 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ గల మొబైల్ ఫస్ట్ సెల్ డిసెంబర్ 7వ తేదీన ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. వన్‌ప్లస్ నార్డ్ కు పోటీగా మోటోరోలా ఈ మొబైల్ ని తీసుకొచ్చింది. వన్‌ప్లస్ నార్డ్ బేస్ 6 జీబీ + 64 జీబీ వేరియంట్‌కు రూ .24,999, 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌కు రూ .27,999, 8 జీబీ + 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌కు రూ .29,999 వద్ద ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌ను అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఇండియా స్టోర్ నుంచి కొనుగోలు చేయవచ్చు.(చదవండి: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్)
మోటోరోలా మోటో జీ 5జీ స్పెసిఫికేషన్స్
కొత్త మోటో జీ 5 జీ ఆండ్రాయిడ్ 10పై నడుస్తుంది. ఇది 6.7-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1,080×2,400 పిక్సెల్స్) ఎల్‌టిపిఎస్ డిస్‌ప్లేతో వస్తుంది. మోటోరోలా 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ తో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ని తీసుకొచ్చింది. మైక్రో ఎస్ డి కార్డ్ ద్వారా 1 టెరాబైట్ వరకు విస్తరించుకోవచ్చు. మోటో జీ 5జీలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండరీ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉంది. సెల్ఫీ కోసం ముందు భాగంలో మోటో జీ 5జీలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. మోటో జీ 5 జీ డస్ట్ ప్రొటెక్షన్ విషయంలో ఐపీ 52 సర్టిఫికేట్ పొందింది. ఫోన్ వెనుక భాగంలో వేలిముద్ర సెన్సార్ ఉంది. మోటో జీ 5 జీ 20W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చింది. మోటో జీ 5 జీలో కనెక్టివిటీ కోసం 5జీ, ఎన్‌ఎఫ్‌సి, బ్లూటూత్ 5.1, వై-ఫై 802.11ఏసి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, జిపిఎస్ ఉన్నాయి. ఇది 212 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఇది రెండు కలర్స్ లో లభిస్తుంది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.