మార్కెట్ లోకి మరో బడ్జెట్ మోటోరోలా ఫోన్.. ఫస్ట్ సెల్ ఎప్పుడంటే?

0

మోటోరోలా మోటో జీ 9 పవర్ బడ్జెట్ మొబైల్ ని డిసెంబర్ 8న భారతదేశంలో లాంచ్ చేసింది. మోటో జీ 9 పవర్ ట్రిపుల్ రియర్ కెమెరా, 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చింది. మోటో జీ 9 పవర్ హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్‌ను కూడా అందిస్తుంది. మోటో జీ సిరీస్‌లో మోటో జీ 5జీ ఫోన్‌ను గతవారమే విడుదల చేసిన మోటోరోలా తాజాగా మోటో జీ9 పవర్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి ఆవిష్కరించింది. మోటో జీ 9 పవర్‌ భారత్‌లో 4జీబీ ర్యామ్‌ + 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.11,999గా ఉంది. ఎలక్ట్రిక్‌ వైలెట్‌, మెటాలిక్‌ ఏజ్‌ కలర్లలో విడుదలైంది. డిసెంబర్‌ 15 నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే లభించనుంది.(చదవండి: ప్రమాదంలో 10 కోట్ల ఆండ్రాయిడ్ యూజర్లు)

మోటో జీ9 పవర్ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే6.8-అంగుళాల హెచ్‌డి (720×1,640 పిక్సెల్స్) ఐపిఎస్
ప్రాసెసర్‌ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్
ఫ్రంట్‌ కెమెరా16 మెగాపిక్సెల్ కెమెరా
రియర్‌ కెమెరా64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగా పిక్సల్ మాక్రో కెమెరా + 2 మెగా పిక్సల్ డెప్త్ కెమెరా
ర్యామ్‌4 జీబీ
స్టోరేజ్‌128 జీబీ (మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించుకోవచ్చు)
బ్యాటరీ6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 10
ఫాస్ట్ ఛార్జింగ్ 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
కనెక్టివిటీ4జీ ఎల్‌టిఇ, వై-ఫై 802.11ac, బ్లూటూత్ వీ 5.0, జిపిఎస్/ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here