రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ టెలికాం వైర్‌లెస్ నెట్వర్క్ సేవల్లో సంచలనం సృష్టించినట్లుగానే దేశంలోని స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో కూడా తన కొత్త ఆలోచనలతో సంచలనాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రిలయన్స్ జియో 2022 నాటికి 200 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్‌లను ఉత్పత్తి చేయబోతున్నట్లు తెలుస్తుంది. బ్లూమ్‌బెర్గ్ ఇచ్చిన నివేదిక ప్రకారం, భారత దేశంలో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ విభాగంలో జియో ప్లాట్‌ఫాంలు వచ్చే రెండేళ్ల నాటికి 200 మిలియన్లకు పైగా స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయాలని యోచిస్తున్నాయి. గత నివేదికల ప్రకారం, సంస్థ మొదట్లో 100 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది, వాటిని 2020 డిసెంబర్ చివరి నాటికి లాంచ్ చేయాలని అనుకున్నారు.(చదవండి: కరోనా వైరస్ అప్డేట్స్ కోసం గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్)
ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ భారతదేశంలో ప్రవేశ స్థాయి ధర $ 54 (4,000 రూపాయలు)కు విక్రయించే అవకాశం ఉంది. దానిలో భాగంగా లావా, కార్బన్ మరియు డిక్సన్ వంటి దేశీయ తయారీదారులతో పాటు ఫాక్స్కాన్ మరియు విస్ట్రాన్ వంటి గ్లోబల్ ప్లేయర్స్ తో కంపెనీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ కంపెనీలతో 33,737 కోట్ల రూపాయలు (4.5 బిలియన్ డాలర్లు) పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ విషయం దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు ఉదపాదక రంగానికి మంచిదే కానీ, షియోమి వంటి ప్రత్యర్థి సంస్థలకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.