కేజీ మట్టి ఖరీదు ఆరున్నర లక్షల కోట్లు

0

అవును.. మీరు విన్నది నిజమే కేజీ మట్టి కోసం లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నారు. కాకపోతే అది భూమి మీద ఉన్న మట్టి కోసం మాత్రం కాదు. అంతరిక్షంలో అంగారక గ్రహం​ మీద ఉన్న మట్టి కోసం. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అధికారికంగా దృవీకరించింది. మార్స్​ మీద ఇప్పటికే నాసా పర్సీవరెన్స్ రోవర్ దిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అది అక్కడ పరిశోదనలు చేయడం కూడా మొదలు పెట్టింది. అయితే అత్యంత విలువైందిగా భావిస్తున్న అక్కడి​ మట్టిని భూమ్మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది నాసా.(ఇది కూడా చదవండి: సింపుల్ ట్రిక్, వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను చదవొచ్చు)

ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా నాసా 9 బిలియన్ల డాలర్లు ఖర్చు చేయబోతోంది. ఒకవేళ అంగారక గ్రహం మీద ఉన్న మట్టి కనుక భూమి మీదకు తీసుకొస్తే గనుక.. ఇప్పటిదాకా భూమి మీద ఉన్న అపురూపమైన వస్తువులలో అదే మొదటి స్థానంలో ఉంటుంది. దాదాపు రెండు పౌండ్ల మట్టి(దాదాపు కేజీ)ని మార్స్​ నుంచి భూమి మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మూడు దశలలో ఈ ప్రాజెక్టు ఉండబోతుంది. అయితే ఈ శాంపిల్ సేకరణ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి రెండేళ్లు పట్టే అవకాశం ఉందని నాసా చెబుతుంది. ఇక ఆ మట్టిని భూమి మీదకు తేవడానికి మరో పదేళ్లకాలం పైనే పట్టవచ్చు అని అంచనా. ఇది ఇలా ఉంటే, మార్స్​ మట్టి కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయబోతున్న నాసా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Support TechPatashala

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here