గుడ్ న్యూస్.. 48 గంటల పాటు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తున్న నెట్ ఫ్లిక్స్

0

వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు తీసుకొస్తున్న నెట్‌ఫ్లిక్స్. ఇప్పడు, తాజాగా భారత వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్ ని ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ కొత్త వినియోగదారులను ఆకర్షించడంలో భాగంగా “స్ట్రీమ్ ఫెస్ట్” అనే కార్యక్రమం నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమంలో డిసెంబరు 4 నుంచి 48 గంటల ఉచిత నెట్‌ఫ్లిక్స్‌ ఆఫర్ ని మన దేశంలోనే తీసుకొస్తారని సమాచారం. నెట్‌ఫ్లిక్స్ ఇంతకుముందు కొత్త వినియోగదారుల కోసం 30 రోజుల ఉచిత ట్రయల్‌ను నిర్వహించారు, దానిలో భాగంగా కొన్ని వెబ్ సిరీస్‌లను చూడటానికి అనుమతించారు. అయితే, ఈ ట్రయల్ ని కొన్ని దేశాలలో ప్రస్తుతం తొలగించారు. ఇప్పుడు దాని స్థానంలో ఈ 48 గంటల తీసుకొస్తారని సమాచారం. నెట్‌ఫ్లిక్స్ గత నెలలో నెల రోజుల ఉచిత సేవల ఆఫర్‌ని అమెరికాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌లో మాత్రం ఈ ఆఫర్ ఇంకా అందుబాటులోనే ఉంది. (చదవండి: వన్ ప్లస్ 9 స్మార్ట్ ఫోన్ యొక్క ఫోటో లీక్)

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here