మళ్లీ బ్యాంకు రుణాలపై మారటోరియం విధిస్తారా..?

0

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తుంది. గత ఏడాది చేదు జ్ఞాపకాలు మరిచిపోక ముందే మళ్లీ అవే పరిస్థితులు తిరిగి పునరావృతం అవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా కాస్త ఎక్కువగానే ఈ సారి కరోనా మహమ్మారి ప్రభావం ఉంది. గతంలో కంటే మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. కేంద్రంతో అన్ని రాష్ట్రాలు నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. ప్రజల ప్రాణాలను రక్షించడమే ప్రథమ ధ్యేయంగా పెట్టుకున్నాయి. తమ రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ఫ్యూని విధిస్తున్న ప్రభుత్వాలు, అవసరమైన ప్రాంతాల్లో లాక్ డౌన్ ను కూడా పెడుతున్నాయి.

అయితే. ఈ మహమ్మారి వల్ల చిన్న, మధ్య కుటుంబలపై ఆర్దిక భారీగా పడుతుంది. పెరిగిన ధరలతో, ఈ కరోనా కల్లోలంలో సామాన్యుడు జీవనం సాగించడమే కష్టంగా మారింది. గతంలో తీసుకున్న బ్యాంకు లోన్లు, క్రెడిట్ కార్డు ఈఎమ్ఐలు కట్టలేక నరకయతన పడుతున్నారు. అయితే, ఈ సారి కూడా గత ఏడాది మాదిరిగానే రుణాలపై మారటోరియం విధిస్తారా? ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐకు ఏమైనా సూచనలు చేస్తుందా? అనే అంశంపై రుణగ్రహీతలు ఉత్కంఠతతొ ఎదురుచూస్తున్నారు.(ఇది కూడా చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకోండి ఇలా!)

ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్ 23న నిర్వహించిన ఆన్ లైన్ మీడియా మీట్ లో క్లారిటీ ఇచ్చారు. ‘కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నప్పటికీ బడ్జెట్ లో ప్రతిపాదించిన అన్ని సంస్కరణలను ముందుకు తీసుకెళ్తాం. వాటిని ఆపే ప్రసక్తే లేదు, ఆయా రంగాల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను గతంలో చెప్పినట్టుగానే తీసుకెళ్తాం. ప్రస్తుతం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. దేశంలో అక్కడక్కడా లాక్ డౌన్ అమలు అవుతున్నప్పటికి ఆర్థిక వ్యవస్థ తెరిచే ఉంది. అందువల్ల మళ్లీ బ్యాంకు రుణాలపై, క్రెడిట్ కార్డు ఈఎమ్ఐలపై మారటోరియం పెట్టే ఆలోచన ప్రస్తుతానికి లేదు‘ అని కేంద్ర ఆర్థికమంత్రి పేర్కొన్నారు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here