డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేని హైదరాబాద్ ఎలక్ట్రిక్ బైక్

0
ATUM 1.0 Electric Bike

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రంగం ఏదైన ఉంది అంటే అది ఎలక్ట్రిక్ వాహన రంగం అని చెప్పుకోవాలి. పర్యావరణ అనుకూలంగా ఉండటంతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఇది భాగ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మార్కెట్ లోకి ప్రతి వారానికి ఒక ఎలక్ట్రిక్ బైక్ విడుదల అవుతుంది. ఇప్పడు హైదరాబాద్ కు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ సింగల్ ఛార్జ్ తో 100 కి.మీ దూరం వెళ్లే ఒక ఎలక్ట్రిక్ బైక్ ను లాంచ్ చేసింది.

దీని నడపడటానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదని పేర్కొంది. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) ద్వారా సర్టిఫై చేయబడ్డ తక్కువ-స్పీడ్ మోటార్ సైకిల్. ATUM 1.0 ఎలక్ట్రిక్ బైక్ ను తయారు చేయడానికి వంశీ, పది మంది ఇంజనీర్ల బృందానికి మూడు సంవత్సరాలు పట్టింది. డిజైన్ చూస్తే వింటేజ్ కేఫ్-రేసర్ బైక్ వలె ఉంది. దీని బరువు 35 కేజీలు మాత్రమే ఉండటం విశేషం. ఇది గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళుతుంది. బైక్ లు రెండు సంవత్సరాల వారెంటీతో వస్తాయి. టీనేజర్ లు, వయోజనులు నడపడానికి ఇది అనుకూలంగా ఉంటుంది.

దీనిలో 48వోల్ట్ 250 వాట్ ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది కేవలం నాలుగు గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయబడుతుంది. బ్యాటరీని బయటకి తీసి మళ్లీ ఫుల్ చార్జ్ చేసుకొని అమర్చవచ్చు. తద్వారా ఛార్జ్ చేయడం మరింత సులభతరం అవుతుంది. బైక్ లో ఉన్న డిజిటల్ డిస్ ప్లే లో బ్యాటరీ లెవల్, స్పీడ్, కిలోమీటర్ రీడింగ్ చూడవచ్చు.

ప్రస్తుతం మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి 300 బుకింగ్ లు వచ్చాయి. తెలంగాణలో ఉన్న ఉత్పత్తి యూనిట్ ద్వారా ఈ బైకులను రోజుకు 250-300 ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉందని వంశీ పేర్కొన్నారు. ప్రస్తుతం ATUM 1.0 ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.50,000గా ఉంది. ATUM 1.0 ప్రీ-బుక్ చేయాలని అనుకునే వారు వెబ్ సైట్ ద్వారా రూ.3000 అడ్వాన్స్ ని చెల్లించాలి. ప్రొడక్ట్ డెలివరీకి కొన్ని రోజుల ముందు తుది పేమెంట్ చేయాల్సి ఉంటుంది అని గడ్డం వంశీ తెలిపారు.

మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here