తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కోసం ప్రజల భాదలు తప్పేలా కనిపించడం లేదు. మరోసారి రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ నిలిపివేస్తునట్లు ప్రభుత్వం ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఆధార్ ఆడగొద్దని హైకోర్టు సూచించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేవలం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేసినట్లు పేర్కొంది. ధరణిలో జరిగే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. ఇప్పటి వరకు స్లాట్ బుకింగ్ చేసుకున్న వారి రిజిస్ట్రేషన్ సర్వీసులు కొనసాగుతాయని పేర్కొన్నారు. కానీ, కొత్తగా రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ నిలిపివేసినట్లు పేర్కొంది. తదుపరి స్లాట్ బుకింగ్ కోసం రెండు రోజుల్లో వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు.
ఇంకా చదవండి: పీఎం వాణి పబ్లిక్ వైఫైతో 2 కోట్ల మందికి ఉపాధి
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఆదేశాలతో అనుసరించాల్సిన వ్యూహలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నేడు రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. వారం రోజుల క్రితం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించింది. అయితే, స్లాట్ బుకింగ్ ప్రక్రియలో భాగంగా వినియోగదారుల ఆధార్ నెంబర్, పీటీఎన్ నెంబర్ తప్పనిసరి చేయడంతో సమస్యలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రియల్టర్లు ఓపెన్ ప్లాట్ల నమోదు కూడా కావడం లేదని, కేవలం ఇళ్ల స్థలలకు సంబందించిన కొన్ని రిజిస్ట్రేషన్లు మాత్రమే అవుతున్నాయని అని చెప్పారు. ఆధార్, పీటీఎన్ నెంబర్ తప్పనిసరి హైకోర్టు సూచించింది. దీంతో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్ లు నిలిపివేస్తునట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.