మొబైల్‌లోనే ఓటరు గుర్తింపు కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు..

0

ఇక నుంచి ఓటరు గుర్తింపు కార్డు’ను తమ మొబైల్ ఫోన్ ల ద్వారానే డౌన్లోడ్ చేసుకొనే నూతన విధానాన్ని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. భారత ఎన్నికల కమిషన్ కొత్తగా ఈ-ఎపిక్ అనే సౌకర్యాన్ని తీసుకువచ్చింది. అందులో భాగంగా రిజిస్టర్డ్ ఓటర్లు తమ ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డ్(ఈపీఐసీ)ను తమ రిజిస్టర్డ్ మొబైల్‌లో పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ ఫార్మాట్ ని సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు.(ఇంకా చదవండి: బంపర్ ఆఫర్: ఆ టెక్నాలజీ కనిబెడితే రూ.730కోట్లు మీ సొంతం!)

ఇప్పటివరకు, ఓటరు గుర్తింపు కార్డు(EPIC)ను సమీపంలోని మీసేవా కేంద్రాల ద్వారానే పొందాల్సి ఉండేది. ఈ సౌకర్యం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఈ-ఎపిక్ కార్డును కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నామని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కార్యాలయం తెలిపింది.

అర్హత గల EPIC నంబర్ ఉన్న ఓటర్లు ఫిబ్రవరి 1 నుంచి ఈ-ఎపిక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొత్తగా నమోదైన ఓటర్లు ఈ నెల 25 నుంచి 31 వరకు తాము రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌ ద్వారా ఈ- ఎపిక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. ఈ-ఎపిక్ విధానంపై ఓటర్లలో అవగాహన కల్పించాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. కొత్త విధానంపై ‘ఈ-ఓటర్ హువా డిజిటల్, క్లిక్ పర్ ఏపిక్’ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తుంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here